Advertisement
Prabhas and Anushka: సౌత్‌లో అత్యంత ఆరాధించే ఆన్‌స్క్రీన్ జంటలలో ప్రభాస్ మరియు అనుష్క శెట్టి జంట ఒకటి. వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. బాహుబలి సినిమా తరువాత పెళ్లి చేసుకుంటారు అంటూ అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి. కానీ.. వీరిద్దరి మధ్య ఉన్న బంధం స్నేహం మాత్రమే అని.. పెళ్లి ఆలోచన మాకు లేదు అంటూ వారు క్లారిటీ ఇచ్చినప్పటికీ అభిమానులు మాత్రం వీరి జంట గురించి కలలు కనడం మానలేదు. ఇక వారి పెళ్లి జరగకపోవడంతో అభిమానులు వారి కలలను AI క్రియేటివిటీతో చూపిస్తున్నారు.
Advertisement
బాహుబలి: ది బిగినింగ్ (2015) మరియు బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) వంటి సినిమాల్లో వారి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో క్లిక్ అయ్యింది. వారిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లు కనిపిస్తారు. అందుకే వారి అభిమానులు కూడా వారిద్దరూ ఒక్కటి అవ్వాలని కోరుకున్నారు. ప్రభాస్ మరియు అనుష్క శెట్టి మధ్య రిలేషన్స్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా.. వారిద్దరూ మాత్రం తాము కేవలం స్నేహితులం మాత్రమేనని చెప్పుకుంటూ వచ్చారు.
Advertisement
ఇటీవల, ప్రభాస్ మరియు అనుష్క శెట్టి సహ-నటుల యొక్క కొన్ని ఉత్కంఠభరితమైన AI-ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నట్లు కొన్ని ఫోటోలను తీశారు. అలాగే.. వారికి ఒక పాప ఉంటె వారి ఫామిలీ ఫోటో ఎలా ఉంటుందో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారు. ఈ AI- రూపొందించిన ప్రభాస్ మరియు అనుష్క శెట్టి చిత్రాలను చూడటానికి సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వీరిద్దరూ ఇలా రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకుంటే బాగుండు అని కోరుకుంటున్నారు.
#1
#2