Advertisement
సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు నట వారసుడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత వర్షం సినిమాతో సక్సెస్ అందుకొని, ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే జక్కన్న చేతిలో పడి బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈనెల 11న మృతిచెందిన విషయం అందరికి తెలిసిందే.
Advertisement
also read: చిరంజీవితో సినిమా తీసి కెరీర్ నాశనం చేసుకున్న డైరెక్టర్స్.. ఇంతమంది ఉన్నారా..?
దీంతో కుటుంబ సభ్యులు ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ సెలబ్రిటీలతో పాటు లక్షలాది మంది అభిమానులు వచ్చారు. 12 సంవత్సరాల తర్వాత ప్రభాస్ కుటుంబం మొగల్తూరులో కనిపించడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.. దీంతో లక్షలాది మంది అభిమానులు ప్రభాస్ ఇంటి వద్దకు చేరుకొని నినాదాలతో హోరెత్తించారు.. అభిమానుల కోసం ప్రభాస్ గొప్ప మనసు చాటాడు. 50 రకాల వంటకాలతో లక్షలాది మందికి సరిపోయేలా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వంటకాల కోసం దాదాపుగా నాలుగు కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
ఈ క్రమంలో 50 రకాల వంటకాలతో ఉన్నటువంటి ఫుట్ నేను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికోసం ఆయన 6 టన్నుల మటన్, 6 టన్నుల బిర్యానీ మటన్, ఒక టన్ను రొయ్యల గోంగూర ఇరుగు, ఒక టన్ను బొమ్మిడాల పులుసు, ఆరు టన్నుల చికెన్ కర్రీ, నాలుగు టన్నుల చికెన్ ఫ్రై, ఆరు టన్నుల చికెన్ బిర్యాని, నాలుగు టన్నుల చందువా ఫిష్, రెండు టన్నుల చిట్టి చేపల పులుసు, అంతే కాకుండా మరో ఇరవై రెండు రకాల నాన్ వెజ్ వంటకాలు, మరెన్నో వెజ్ వంటకాలు అరేంజ్ చేసారు.. సంస్మరణ సభకు వచ్చిన అభిమానులకు ఏ మాత్రం తక్కువ కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించి రాజుల వంశం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు యంగ్ రెబల్ స్టార్.
also read:నాగచైతన్య కు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడని తెలుసా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడాంటే..?