Advertisement
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా నటులకు సంబంధించిన విషయాలు, నటులకి సంబంధించిన ఫోటోలు మనకి వస్తున్నాయి. సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ ని కొట్టేసింది భారీ కలెక్షన్లు కూడా రాబడుతోంది. మూడు సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత ప్రభాస్ పెద్ద హిట్‌ని కొట్టేశారు ప్రపంచ వ్యాప్తంగా సినిమా నుండి భారీ వసూళ్లు వస్తున్నాయి. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు ప్రభాస్ తర్వాత హిట్లు రాలేదు కానీ చాలా కాలం తర్వాత సలార్ సినిమాతో ప్రభాస్ హిట్ కొట్టారు అయితే ప్రభాస్ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
ప్రభాస్ వ్యక్తిత్వంతో స్నేహితులకి అభిమానులకి దగ్గరయ్యారు ముఖ్యంగా ఫుడ్ విషయంలో ప్రభాస్ కి సంబంధించి వార్తలు ఎన్నో వస్తూ ఉంటాయి. డార్లింగ్ తన స్నేహితుల కోసం రకరకాల వంటకాలని వండడానికి ఇష్టపడతాడు. ప్రభాస్ కి భోజనం అంటే చాలా ఇష్టం వెరైటీ ఫుడ్ల కోసం ప్రాణాన్ని ఇస్తాడు అని బంధువులు కూడా చెప్తూ ఉంటారు. ఆహార ప్రియుడైన ప్రభాస్ రకరకాల వెజ్ మరియు నాన్ వెజ్ ని తింటూ ఉంటాడు. నాన్ వెజ్ అంటే ప్రభాస్ కి పంచప్రాణాలు బాగా తినడం అలానే అందరికీ ఇవ్వడం అంటే ఇష్టమట. అందరినీ తినమని ప్రభాస్ బలవంతం చేస్తూ ఉంటాడు.
Advertisement
ప్రభాస్ సెట్లకి రకరకాల ఫుడ్స్ ని తీసుకురావాలని కూడా చెప్తూ ఉండేవాడట నటి పూజా హెగ్డే, శ్రద్ధ కపూర్, శృతిహాసన్, రాజమౌళి ఇలా పలువురు గతంలో కూడా ఈ విషయాలను వెల్లడించారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ప్రభాస్ భోజనం ప్రియుడు అని మాట్లాడం జరిగింది. పృధ్విరాజ్ భార్య, పిల్లలు ఒకరోజు సెట్ కి వచ్చారట అది తెలిసి ప్రభాస్ డిన్నర్ ని రెడీ చేశారు. ఆ వంటకాలను చూసి ఆమె ఆశ్చర్యపోయారట ప్రభాస్ తో ఉంటే డైట్ ని ఫాలో అవ్వలేమని పృథ్విరాజ్ చెప్పారు. సలార్ సినిమాలో నటించిన టిన్ను ఆనంద్ కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తనకి ఒకసారి లంచ్ బాక్స్ ని పంపించినట్లు చెప్పారు. భోజనాన్ని పంపిస్తానని మూడు పెద్ద పెట్టెల్లో ఫుడ్ ని పంపించారట ప్రభాస్ అది చూసి షాక్ అయ్యారట ప్రభాస్ ఇంట్లో వంట చేయడానికి ఏకంగా ఒక టీం ఉంటుందట. ఒక్కరోజు ఆహారానికి ఏకంగా రెండు లక్షలు ఖర్చు చేస్తారట.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!