Advertisement
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలులన్ని ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. హోరా హోరా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నయి. అయితే , ఈ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్ణాటకలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క పొలిటికల్.. మరో పక్క సినీ గ్లామర్ తో.. కర్ణాటక రాజకీయాలు రసవతంగా మారాయి. సౌత్‌లో ఇప్పటికే పెద్ద పెద్ద తమవైహీరోలను తమవైపు తిప్పుకున్న కమలం.. రాబోయే ఎలక్షన్స్‌లో సిని గ్లామర్ ను డబుల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Advertisement
READ ALSO : ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !
అయితే, ఈ క్రమంలో తాజాగా కన్నడ హీరో కిచ్చా సుదీప్, దర్శన్‌లు బీజేపీకి సపోర్ట్ ఇవ్వడంతో కన్నడనాట రాజకీయం హాట్ హాట్ గా మారాయి. బీజేపీకి కిచ్చా సుదీప్ సపోర్ట్ ఇవ్వడంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులకు కిచ్చా సుదీప్ మద్దతు ఇవ్వడంపై ప్రకాష్ రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కిచ్చా సుదీప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై పై కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి పార్టీ తరుపున ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
Advertisement
READ ALSO : రాజమౌళి సినిమాల్లో “ఛత్రపతి శేఖర్” తప్పకుండా ఉండాల్సిందేనట ఎందుకంటే ?
అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి సూచించిన అభ్యర్థులకు మాత్రకమే ప్రచారం చేస్తానని ప్రకటించారు. పార్లీలో చేరబోనంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.కిచ్చా సుదీప్ చేసిన ప్రకటన పై స్పందించిన ప్రకాష్ రాజ్.. ఎప్పటినుంచో భారతీయ జనతా పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్.. కిచ్చా సుదీప్ ‘‘కాషాయ పార్టీకి ఎర కాబోరు.. చాలా తెలివైన వారు” అంటూ ట్వీట్ చేశారు. అయితే, తాను రాజకీయాలోకి రావడం లేదని సుదీప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కష్ట సమయాల్లో ఆయన తనకు అండగా నిలిచారని.. తన కుటుంబంతో చాలా సన్నిహిత బంధాన్ని పంచుకున్నారని గుర్తుచేసుకున్న కిచ్చా సుదీప్.. బొమ్మైకి తన మద్దతును ప్రకటించారు.
READ ALSO : హీరోయిన్ లయ అమెరికా లో ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా ? ఆమె నెల జీతం ఎంతంటే ?