Advertisement
మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి దీనికోసం ఒకవైపు వైసీపీ అభ్యర్థుల్ని అధికార పార్టీ ఖరారు చేస్తుంటే ఎన్నికల తర్వాత రాబోయే ఫలితాలపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడం ఖాయమని అన్నారు.. ఏపీలో ఏర్పడబోయేది టిడిపి ప్రభుత్వమని కీలక కామెంట్స్ చేశారు అలానే చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు కోరుకుంటున్నారని కానీ ఉచితాలు కాదని ఆలోచిస్తున్న సంక్షేమ పథకాల వలన ఓట్లు పడవని చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రశాంతి కిషోర్ కీలక కామెంట్స్ చేయడం జరిగింది.
Advertisement
Advertisement
దీంతో వైసీపీ శ్రేణులు అసహనానికి గురవుతున్నారు గత ఎన్నికల్లో వైసిపి తరఫున వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ వైసిపి గెలవడానికి దోహత పడ్డారు. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని చెప్పడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు గతంలో మాజీ ఎంపీ లగడపాటి కూడా ఈ విధంగానే మాట్లాడారని అన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా సిద్ధంగా ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ని కొట్టి పారేస్తున్న వైసిపి శ్రేణులు కింద ఓటమి భయం పట్టుకుంది.
టిడిపి జనసేన శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీలో కచ్చితంగా వైసీపీ ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారు. టిడిపి జనసేన పార్టీలు అయితే అందుకు తగినట్లుగానే పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ప్రజల నాడి ఎలా ఉందో ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయాన్ని ఇప్పుడైతే చెప్పలేని పరిస్థితి ఈ టైంలో ప్రముఖ రాజకీయ వ్యవహార కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ ప్రజలు వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారని జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!