Advertisement
బిహార్ రాజకీయాలు ఎప్పుడూ ఇంట్రస్ట్ గా ఉంటాయి. అధికార జేడీయూ ఎప్పుడు ఎవరితో పొత్తులో ఉంటుందో తెలియని పరిస్థితి. కొద్ది రోజుల వరకు ఎన్డీఏతో దోస్తీ కట్టింది. ప్రస్తుతం ఆర్జేడీతో పొత్తులో ఉంది. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రాన్ని ఆర్జేడీ, జేడీయూనే పాలిస్తున్నాయి. ఈ రెండుపార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. అయితే.. బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఈయన.. నితీష్ టార్గెట్ గా రాజకీయం నడుపుతున్నారు.
Advertisement
జేడీయూ, ఆర్జేడీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ప్రయత్నాల్లో ఉన్న పీకే.. సీఎం నితీశ్ లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిజంగా బీజేపీతో జేడీయూకి సంబంధాలు లేకుంటే హరివంశ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎందుకు ఉంటారని ప్రశ్నించారు పీకే. మహా కూటమి సంతోషకరమే అయినా.. బీజేపీతో ఇంకా సంబంధాలు కొనసాగించడం సరికాదని విమర్శలు గుప్పించారు. రెండు దారుల్లో పయనం అన్ని వేళలా పనికి రాదని హితబోధ చేశారు.
Advertisement
నితీశ్ కుమార్ కు బీజేపీతో ఇంకా సంబంధాలు ఉన్నాయనేది పీకే ఆరోపణ. అయితే.. ఆయన వ్యాఖ్యలను సీఎం ఖండిస్తున్నారు. పీకే పబ్లిసిటీ కోసం నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎద్దేవ చేశారు. ఆయన తన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకోవచ్చని, తాము మాత్రం వాటిని లెక్క చేయమని అన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వయసులో ఉన్నాడని, కాబట్టి ఏదైనా మాట్లాడగలడని చమత్కరించారు నితీశ్.
ఒకప్పుడు పీకే అంటే తనకు మంచి గౌరవ భావం ఉండేదని.. అతడు మాత్రం తనను అగౌరవ పర్చాడని అసంతృప్తి వ్యక్తం చేశారు నితీశ్. బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సైలెంట్ గా పావులు కదుపుతున్నారు. నిత్యం జనాల్లో ఉండేందుకు పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటిదాకా తాను ఇతర పార్టీల గెలుపు కోసం వేసిన ప్లాన్స్ అన్నీ ఇప్పుడు తన రాజకీయ ఎదుగదల కోసం వాడేస్తున్నారు.