Advertisement
తెలంగాణలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తన వంతుగా కృషి చేస్తోంది కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ, భువనగిరి ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ జాబ్ మేళా నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఆశాకిరణంగా మారింది. తాజాగా 15,16 తేదీల్లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. రెండు రోజులపాటు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. మొదటి రోజు దాదాపు 45 వేలకు పైగా అభ్యర్థులు రాగా 14000 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు.
Advertisement
Komati Reddy Pratheek Foundation Job Mela
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓ బిటెక్ విద్యార్థికి ఫ్యాక్ట్ సెట్ అనే కంపెనీ 9 లక్షల రూపాయల భారీ ప్యాకేజ్ ఆఫర్ చేసింది. రెండో రోజు కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. 15 వేలకు పైగా అభ్యర్థులు రాగా 4వేల మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. రెండు రోజుల్లో మొత్తం 20,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా చేసింది కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓయూ వైస్ ఛాన్స్లర్ రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ పోటీ కాలంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు తమలోని ప్రత్యేక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
Advertisement
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఇక చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని మంచి అవకాశాలు సాధించారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ జాబ్ మేళాలో పాల్గొన్న అభ్యర్థులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతీక్ ఫౌండేషన్ ఎందుకు పెట్టారు ?
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. దూరమైన కుమారుడి పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఆ ఫౌండేషన్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Read also : Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ