Advertisement
బ్రహ్మంగారు ఒక గొప్ప జ్ఞాని. ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో బ్రహ్మంగారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడుగగా బ్రతువు దెరువు కోసం వచ్చాను. ఏదైనా పని ఉంటే చెప్పండి అనగా అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులని తోలుకెళ్ళమని చెప్పగా, బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారాడు.
Advertisement
అయితే, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానం లోని విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. అయితే క్రీ.శ 1608 లో వీరబ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ఆయన ముందుగానే దర్శించి, దానినే కాలజ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించారు. వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
#ఉన్నత కులాల జనాభా కీర్తించబడటం ఆగిపోతుంది. వారి స్థాయిలన్నింటినీ కోల్పోతారు.
#తిరుమలలోని ఏడు కొండల నుండి ప్రవహించే ‘జల జీవ నది’ (జీవనాన్ని ఇచ్చే) నది పుడుతుంది. ఈ ప్రక్రియలో లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది.
#హైదరాబాద్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది. ఎందుకంటే నగరంలోని అన్ని సరస్సులు చివరికి ఎండిపోతాయి.
#సముద్రాలన్నీ కలుషితమవుతాయి. సముద్ర జాతులు అంతరించిపోతాయి.
#అత్యధిక జనాభా కలిగిన 21 భారతీయ నగరాలు ఒకే రోజులో నాశనం అవుతాయి.
#కలియుగం చివరిలో కాశీలో గంగా నది ప్రవహించదు.
#పంది గర్భం నుండి ఏనుగు పుడుతుంది.
#కులాంతర వివాహాలు పెరుగుతాయి.
#దేశమంతటా పేలుళ్లు జరుగుతాయి.ఒకరికొకరు భయపడి జీవించడం ప్రారంభిస్తారు.
#కాశ్మీర్‌లో భూమి కోసం విపరీతమైన పోరాటం జరుగుతుంది. పవిత్ర నగరమైన కాశీలో భయంకరమైన మత యుద్ధం కూడా జరుగుతుంది.
#స్త్రీలు పురుషుల కంటే మరింత శక్తివంతం అవుతారు.
Read also: ఆర్య సినిమాలోని గీత మరీ ఇంతలా మారిపోయిందా..?