Advertisement
2012 .. తెలంగాణ ఉద్యమ సమయంలో.. తెలంగాణ కోసం ఓ మహిళా డిఎస్పి తన ఉద్యోగాన్ని త్యాగం చేసారు. అప్పట్లో ఆమె పేరే ఓ సంచలనం సృష్టించింది. ఈ పన్నెండేళ్ల కాలంలో ఆమె ఎప్పుడూ తన పదవిని తిరిగి కోరలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు.. ఇప్పుడు ఆమె ఎందుకు ట్రేండింగ్ లో ఉన్నారో తెలుసుకుందాం. తెలంగాణ అంశంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దాదాపు పన్నెండేళ్ల క్రితమే రిజైన్ చేసారు. 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండె చప్పుడును అర్థం చేసుకోలేని సున్నితత్వం లేని ప్రభుత్వంలో తాను పని చేయలేనందున రాజీనామా చేస్తున్నట్లు మెదక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నళిని పోలీసు డైరెక్టర్ జనరల్‌కు తన రాజీనామా లేఖలో తెలిపారు.
Advertisement
ఆ రాజీనామా తరువాత నళిని మళ్ళీ కనిపించలేదు. సామాజిక ప్రపంచానికి దూరంగానే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రయత్నించే వారిపై లాఠీని విసరలేను అని చెబుతూ ఉద్యోగాన్ని వదిలేసింది. మేర కులానికి చెందిన ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఢిల్లీలో దీక్షలు కూడా చేసింది. రెండుసార్లు రాజీనామా లేఖలు కూడా ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో దూరమైన ఆమె తిరిగి కనిపించలేదు. కానీ, తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
Advertisement
రాజీనామా చేసిన పన్నెండేళ్ల తరువాత నా పేరు ఎందుకు వైరల్ అవుతోందో తెలియదు.. కానీ నాకు తిరిగి డిఎస్పి బాధ్యతలు తీసుకునే ఉద్దేశ్యం లేదు. కొందరు జర్నలిస్ట్ లు బైట్ కావాలని అడుగుతున్నారు. కానీ, నేను దేనికీ సిద్ధంగా లేను. అన్నిటికి దూరంగా, ఆధ్యాత్మికంగా ప్రశాంత జీవితం గడుపుతున్నా. ప్రస్తుతం నేను యజ్ఞ బ్రహ్మ గా, వేదప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా బతుకుతున్నా. ఉద్యమ సమాయంలోనే నన్ను దేశద్రోహిని అంటూ 2011 లోనే నన్ను సస్పెండ్ చేసారు. బీజేపీ లో సభ్యత్వం, ఉప ఎన్నికల్లో పోటీ ఇవన్నీ ఉద్యమం కోసమే చేశాను. ఏది ఎలా జరిగినా నేను రాజీనామాను ఉపసంహరించుకోలేదు. తిరిగి ఉద్యోగం కావాలని కూడా అడగలేదు. ఒక్కసారిగా నా పేరు ఎందుకు బయటకి వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది.
ఇప్పుడు కూడా ఉద్యోగం కోసం యాచించడం నాకు ఇష్టం లేదు.. అసలు ఆ అవసరం కూడా లేదు. యోగినిగా, ఆధ్యాత్మిక మార్గంలో ప్రశాంతంగానే బతుకుతున్న. ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినా.. పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు కూడా. అన్నిటిని దాటుకుని ఇప్పటి ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చినా నేను పూర్తిగా న్యాయం చేయగలిగే పరిస్థితిలో లేను. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మూలంగా నాలో సత్తువ దెబ్బతింది. గతంలో ముఖ్యమంత్రి రోశయ్య గారు ఉద్యోగం ఇచ్చారు కదా అని వెళితే.. పద్దెనిమిది నెలలు ఎంత సఫర్ అయ్యానో నాకు గుర్తే. ఎదో ఒకరంగా ప్రజాసేవ చేస్తాను తప్ప.. ఉద్యోగం అడగను..” అంటూ నళిని స్పష్టం చేసారు.
Read More:
మర్యాద రామన్న మూవీలో ఈ సీన్ చూడండి..బిగ్ మిస్టేక్.. ఎలా మిస్సయ్యారు జక్కన్న..!!