Advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం విపరీతంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పక్కా ఈ సినిమా హిట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆయన సినిమా కోసం ఇన్నేళ్లు కేటాయించారు అంటే కచ్చితంగా సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. అల్లు అర్జున్ గడ్డం కోసమే చాలా డబ్బులు ఖర్చు చేశారట. ఇక దానికి సంబంధించిన వివరాలను చూద్దాం.. ఈ ఏడాది డిసెంబర్ నెల ఆరవ తేదీన థియేటర్లలో పుష్ప టూ రిలీజ్ కాబోతోంది.
Advertisement
సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఏ మాత్రం మార్పు లేదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మొదట గడ్డం పెంచిన బన్నీ కొన్ని రోజుల క్రితం విదేశాలకు వెళ్లే సమయంలో వేరే లుక్ లో కనపడ్డారు. ప్రస్తుతం పుష్పా ది రూల్ క్లైమాక్స్ జరుగుతుండగా.. పెట్టుడు గడ్డంతో ఈ సినిమా షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. గడ్డం ఖరీదు ఏకంగా 40 లక్షల రూపాయలని తెలుస్తోంది. ముంబై నుంచి ప్రత్యేకంగా నిపుణులు వచ్చినట్లు కూడా తెలుస్తోంది.
Advertisement
Also read:
బన్నీ గడ్డం కోసమే ఇంత ఖర్చు చేసారంటే ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పుష్ప ది రూల్ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండడంతో బడ్జెట్ విషయంలో మేకర్స్ కు ఎలాంటి సమస్య లేదని తెలుస్తోంది. పుష్ప ది రూల్ మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అందుకోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది, సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాలు తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!