Advertisement
పెళ్లి అంటే మామూలు ముచ్చట కాదు. ఒక్కసారి మూడుముళ్ల బంధం పడ్డాక… నూరేళ్లు జీవించాల్సిందే. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లి జరిగిన కొన్ని రోజులకే.. విడిపోతున్నారు. మరి కొంతమంది ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే.. పూర్వకాలంలో అమ్మాయికి 18 ఏళ్లు అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్లు చేసేవారు. అయితే ప్రస్తుత కాలంలో మగవారితో పోటీగా ఆడవారు కూడా అన్ని విషయాలలో ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో మగవారితో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తూ, డబ్బు వేటలో పడి పెళ్లి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరికొంతమంది జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేవారు ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న వారికి ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
30 దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న చాలామంది వారి కెరీర్ పై దృష్టి పెట్టి సంసారాలను పట్టించుకోవడం లేదు. దీంతో వీరిని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామికి సమస్యలు తప్పడం లేదట. ఎన్నో కలలు కంటూ మీ జీవితంలోకి వచ్చిన సదరు అమ్మాయిని చాలా నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఎదగడం కోసమే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారట.
Advertisement
ఈ విధంగా చేస్తూ అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల జీవిత భాగస్వామికి అనుమానాలు అపార్ధాలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లడం చాలా చూస్తున్నాం. కాని వివాహ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలైనా తట్టుకోవలసిందే దీనికోసం భార్య భర్తలు ఇద్దరూ సమన్వయం పాటించి ఉంటేనే సంసార జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే వారి మధ్య ఆకర్షణ తగ్గి అనేక అనుమానాలకు బీజం పడుతుంది. ఈ తరుణంలో సఖ్యతగా ఉండేందుకు ఒకరికొకరు దాపరికాలు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అప్పుడే సంసార జీవితం ముందుకు పోతుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ డబ్బుతో పాటుగా జీవిత భాగస్వామి ప్రేమను కూడా పట్టించుకోవాలి.
Read also :“సర్కారు వారి పాట” సినిమా ఫ్లో ను, దెబ్బతీసిన సన్నివేశం గురించి తెలుసా ?