Advertisement
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అనగానే చాలామంది చెప్పే పేరు దిల్ రాజు. పరిమిత బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలను నిర్మించడంతోపాటు క్రేజ్ ఉన్న సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ దిల్ రాజు తన క్రేజ్ ని పెంచుకుంటున్నారు. హీరోలకు సమానమైన క్రేజ్ ని దక్కించుకున్న అతికొద్ది మంది నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో దిల్ రాజు తరచుగా వార్తలలో వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దిల్ రాజు వ్యక్తిగత విషయాల గురించి కూడా మనకి తెలిసిందే. ఆయన మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించారు.
Advertisement
Read also: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం గురించి ఆసక్తికర విషయాలు!
ఆ తరువాత మూడేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన దిల్ రాజు 2020 లాక్ డౌన్ సమయంలో తేజస్విని అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఆమె పేరుని వైఘా రెడ్డి గా మార్చారు. అయితే అందరూ ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని అనుకున్నారు. కానీ ఇందులో లవ్ స్టోరీ ఉందని.. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు బయటపెట్టారు. సంక్రాంతి సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. ” అనిత మరణించిన తర్వాత రెండేళ్లు చాలా కష్టాలు అనుభవించాను. అప్పటికి నాకు 47 ఏళ్ళు ఉన్నాయి. జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్లాలనుకుంటున్న సమయంలో నా ముందు రెండు మూడు ఆప్షన్స్ వచ్చాయి.
Advertisement
కానీ బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకున్నాను. అలా నేను విమానంలో జర్నీ చేసే సమయంలో తేజస్విని పరిచయం అయింది. ఆమె నాకు నచ్చడంతో ఫోన్ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేశా. ఆ ఏడాది తర్వాత తేజస్వినికి ప్రపోజ్ చేశాను. ఆమెకు నచ్చడంతో ఆమె ఫ్యామిలీతో డిస్కషన్ జరిగింది. చివరకు పెళ్లి వరకు వెళ్ళింది. ఇక తేజస్వినిలో నాకు బాగా నచ్చిన విషయం ఆమె చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటుంది” అని వారి లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
Read also: LOVE TODAY HEROINE IVANA: క్యూట్ లుక్స్ తో అందరి మనసులు దోచిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?