Advertisement
ఎన్నికలప్పుడు సర్వేలు చేయడం కామన్. కొన్ని సంస్థలు తరచూ రాష్ట్రాల్లో పాలనపై.. సీఎంల గ్రాఫ్ పై సర్వేలు చేస్తుంటాయి. అలాంటి వాటిలో సీఓటర్ సంస్థ ఒకటి. ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ కోసం యాంగర్ ఇండెక్స్ పేరుతో తాజాగా ఈ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న టాప్ 5 రాష్ట్రాల లిస్టు తీసింది. అందులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో దాదాపు మూడింట రెండు వంతుల మంది కేసీఆర్ సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నట్టు సదరు సంస్థ తెలిపింది.
Advertisement
హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రెండు, మూడు స్థానాల్లో ఉండగా ఏపీ నాలుగోస్థానంలో నిలిచింది. అక్కడ జగన్ సర్కార్ పై 56.9శాతం మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారట. ఐదో స్థానంలో కర్ణాటక ఉంది. అయితే.. ఇక్కడో ట్విస్ట్ ఉంది.. ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటున్నాయి కానీ.. ప్రజల నుంచి అతి ఎక్కువ కోపాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో మాత్రం కేసీఆర్, జగన్ కింది స్థానాల్లోనే ఉన్నారు. కేటగిరీలో మొదటి స్థానం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఉండగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా బస్వరాజ్ బొమ్మై, నీతీశ్ కుమార్ ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ అతి తక్కువ ప్రజావ్యతిరేకత ఉన్న సీఎంగా నిలిచారు.
Advertisement
అయితే.. ఇదంతా పెద్ద డ్రామాగా టీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లేదని చెబుతున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నాల్లో ఉన్నారు. ఈమధ్యే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. పార్టీని ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించాలని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు సర్వేలతో కేసీఆర్ పాలనను డ్యామేజ్ చేయాలనే లక్ష్యంతో ఇవన్నీ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు.
ఇక ఏపీలోనూ అంతే. జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని.. జనం హృదయాల్లో నిలిచిపోయారని అంటున్నారు వైసీపీ శ్రేణులు. మొత్తానికి సీఓటర్ సర్వే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.