Advertisement
డైనమిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్యనే “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “లైగర్” సినిమాతో మాత్రం మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. “ఇస్మార్ట్ శంకర్” తర్వాత పూరితో సినిమా చేయాలని వెనకాల పడ్డ హీరోలు కూడా ఇప్పుడు “లైగర్” తర్వాత మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Advertisement
భారీ అంచనాల మధ్య విడుదలైన “లైగర్” పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరిపై ఎక్కడా లేని నెగెటివిటీ కమ్ముకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ పై ఎక్కడా లేని ట్రోలింగ్ మొదలైంది. ఇక లైగర్ డిజాస్టర్ అవడంతో పూరి-విజయ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రావలసిన “జనగణమన” సినిమా కూడా క్యాన్సిల్ అయింది. ఇక పూరి జగన్నాథ్ సంగతి కాసేపు పక్కన పెడితే ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. అందరికన్నా చిన్న తమ్ముడు సాయి రామ్ శంకర్. ఇతడు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించాడు.
Advertisement
ఇక బయట ప్రపంచానికి తెలియని ఒక తమ్ముడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఈ విషయం బయట పెద్దగా ఎవరికి తెలియదు. అతడి పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్. ఇతడు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు ఒక ఎమ్మెల్యే అని ఎక్కడ చెప్పుకోకపోవడం విశేషం. ఇక ఉమా శంకర్ గణేష్ మొదట్లో టిడిపి పార్టీలో ఉండేవాడు. 1995 నుంచి రాజకీయాల్లో ఉన్న ఉమా శంకర్ గణేష్ 2001 వరకు సర్పంచ్ గా, 2009 నుంచి 12 వరకు తాండవ ఆయకట్టు సంఘానికి చైర్మన్ గా పనిచేశాడు. ఇక ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయి 2019లో మాత్రం మంచి మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాడు.
READ ALSO : వింత ఆచారం, శోభనం గదిలోకి పిల్లలతో తల్లి రావాల్సిందే!