Advertisement
ఆదివారం రోజున టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీం ఇండియా టార్గెట్ ను చేరుకుంది. మ్యాచ్ ఆధ్యాంతం నరాలు తెగే ఉత్కంఠంగా కొనసాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరతంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది.
Advertisement
మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి టీం ఇండియాకు విజయాన్ని అందించాడు. ఇది కాకుండా, హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 40 పరుగుల ముఖ్యమైన సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాల అద్భుతమైన భాగస్వామ్యంతో టీం ఇండియా చివరి బంతికి పాకిస్తాన్ ను ఓడించగలిగింది. అలాగే, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన పేరిట ఓ భారీ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టి20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ 500కు పైగా పరుగులు చేశాడు.
Advertisement
మరి ఈ మ్యాచ్ లో అయితే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైండ్ బ్లాకింగ్ ఇన్నింగ్స్ పాకిస్తాన్ నుంచి అద్భుతమైన విజయాన్ని అందించింది. చాలాకాలం తర్వాత కోహ్లీ కం బ్యాక్ అందులోని పాకిస్తాన్ లాంటి జట్టు పై రావడంతో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక ఇదే మ్యాచ్ లో లాస్ట్ లో కోహ్లీతో దిగిన స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ లేటెస్ట్ గా ఆ రోజు కోహ్లీ ఇన్నింగ్స్ పై కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ కోహ్లీ మొదటి 45 బాల్స్ ఆట అలా వదిలేస్తే, తర్వాత 45 బాల్స్ నుంచి చంద్రముఖిలో జ్యోతిక చేసిన గంగలా మారిపోయాడు అని కామెంట్స్ చేశాడు. చంద్రముఖిలో నటుడు ప్రభు తో జ్యోతిక శీను ఉంటుంది కదా దానిని ఉదాహరణగా చెబుతూ అశ్విన్ అయితే పోల్చాడు. దీనితో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతున్నాయి.
READ ALSO : మాకు కాశ్మీర్ వద్దు.. కోహ్లీని ఇచ్చేయండి ప్లీజ్ !