Advertisement
ధనుష్ దర్శకత్వం చేసిన రాయన్ సినిమా ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా రివ్యూ రేటింగ్ కథ వంటి వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. తమిళ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలని ఎంచుకునే హీరోల్లో ధనుష్ ఒకరు. ఇప్పటిదాకా ఈయన చేసిన సినిమాలన్నీ కూడా చిన్న ఫ్లాట్ పాయింట్ తో తెరకెక్కి అద్భుతమైన హిట్లుగా మారాయి. తను ఏ పాత్రలో అయినా సరే పర్ఫెక్ట్ గా నటించి మంచి హిట్ ని కొట్టగలరు.
Advertisement
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయి తిరుగులేని సక్సెస్ ని అందుకున్నారు. ఇక ప్రేక్షకులు ముందుకి ఈరోజు వచ్చిన రాయన్ సినిమా గురించి చూద్దాం.
సినిమా: రాయన్
నటులు: ధనుష్,సందీప్ కిషన్,ఎస్ జే సూర్య,ప్రకాష్ రాజ్,దుషార విజయన్
దర్శకుడు: ధనుష్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాత: కళానిధి మారన్
రిలీజ్ డేట్: 26-07-2024
కథ మరియు వివరణ:
సినిమా కథ విషయానికి వచ్చేస్తే రాయన్ (ధనుష్) నా అనుకున్న మనుషుల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా రాయన్ మనుషులకు, లోకల్ రౌడీలకు మధ్య తీవ్రమైన గొడవ జరుగుతుంది. ఆ గొడవలోకి రాయన్ వచ్చి తన మనుషుల్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు.
ఈ క్రమంలో మిగతా రాజకీయ నాయకులు గొడవలో ఇన్వాల్వ్ అవుతారు. అక్కడి నుండి ఈ కథ ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ధనుష్ 50వ సినిమాగా ఈ చిత్రంలో నటించడమే కాకుండా డైరెక్షన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్.
దర్శకుడిగా ధనుష్ ఎంతో ప్రయత్నం చేశాడు. మొదట ఈ సినిమా స్టార్ట్ చేసిన విధానం కాస్త బోరింగ్ గా అనిపించినా మధ్యలో మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ తెప్పించే ప్రయత్నం అయితే చేశారు.
ఇందులో భాగంగా సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కొర్ ఎమోషనల్ సీన్స్ ని ధనుష్ బాగా హ్యాండిల్ చేసాడు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది. ధనుష్ కూడా డైరెక్షన్ పరంగా కొంతవరకు మెప్పించాడు.
Advertisement
మొదట చూపించిన 15 నిమిషాలు స్టోరీని చివర్లో ఇంటర్ లింక్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే రాసుకున్న పద్ధతి చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎంతో బాగుంది. డైరెక్షన్ పరంగా ధనుష్ కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ ఆయనకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వలన స్క్రీన్ మీద మనకు అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కనపడతాయి.
సీన్లు కూడా బోర్ కొట్టకుండా ఉన్నాయి. దర్శకుడుగా, హీరోగా రెండు కీలక బాధ్యతలు తీసుకున్నారు. రెండిట్లో చాలా వరకు సక్సెస్ అయ్యారు.
ధనుష్ తన స్టామినా ఏంటో తెలుసుకుని దాని మీద ఒక కథ రాసుకొని దర్శకత్వం చేసిన విధానం బాగుంది. మొత్తానికి ధనుష్ డైరెక్టర్ గా మొదటి ప్రయత్నం చేసారు. ఈ సినిమాలో మ్యూజిక్ అయితే బాలేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించినా బాలేదు.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దారుణంగా ఉంది. సినిమాలో పాటలు వచ్చినప్పుడే పాటలు ఎందుకు వస్తున్నాయి అన్నట్లు ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే ధనుష్ ఒక మంచి నటుడు కానీ ఈ సినిమాలో మాత్రం నట విశ్వరూపం చూపించాడు కొన్ని సీన్లలో అయితే మెచ్యూరిటీ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమా స్థాయిని పెంచాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాకి చాలా కీలకంగా మారారు.
Also read:
ప్లస్ పాయింట్స్:
ధనుష్
స్టోరీ
మైనస్ పాయింట్స్:
మ్యూజిక్
బోరింగ్ సీన్స్
అనవసరమైన ఫైట్లు
రేటింగ్: 2.5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!