Advertisement
ఇండియా – న్యూజీలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ జరగడానికి ముందు ఓ వీడియో వైరల్ అయ్యింది. న్యూజిలాండ్ క్రికెటర్ రాచిన్ రవీంద్ర నానమ్మ తన మనవడిని సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీసింది. ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది. అయితే.. ఈ దిష్టి తీయడాన్ని నెటిజన్స్ మరోలా అర్ధం చేసుకుని ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేసారు. రాచిన్ నానమ్మ తనకి దిష్టి తీయలేదని, భారత్ దేశం కోసం.. సెమీఫైనల్స్ లో ఇండియా గెలుపొందాలని పూజలు చేసింది అంటూ ట్రోల్ చేసారు.
Advertisement
రాచిన్ కూడా తన నానమ్మ తనకి దిష్టి తగలకుండా చేస్తోందనే అనుకున్నాడు తప్ప భారత్ కోసం పూజలు చేస్తోంది అని తెలుసుకోలేకపోయారు అంటూ ట్రోల్ చేసారు. ఈ విషయమై సోషల్ మీడియాలో చాలానే మీమ్స్, జోక్స్ వచ్చాయి. అయితే.. ఇప్పుడు న్యూజిలాండ్ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో.. రాచిన్ నానమ్మ పూజలు ఫలించాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
కేవలం 13 పరుగులకే రాచిన్ అవుట్ అయ్యాడు. 22 బంతులు ఫేస్ చేసిన రాచిన్ మూడు ఫోర్లు కొట్టాడు. కానీ, తక్కువ స్కోర్ కె పెవిలియన్ బాట పట్టాడు. రాచిన్ నానమ్మ పూజలు ఫలించాయి.. మొత్తానికి నానమ్మ రాచిన్ కు బిగ్ షాక్ ఇచ్చిందిగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువ అయ్యాయి. వరల్డ్ కప్ లో టైటిల్ లక్ష్యంగా భారత జట్టు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్స్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా గెలిచి చూపించింది.
Read More:
ఆ పొరపాటు వల్లనే మెగాస్టార్ ని ట్రోల్ చేస్తున్నారా? అసలా వీడియోలో ఏమి ఉంది?
సూపర్ స్టార్ కృష్ణ కనిపిస్తే ఎందుకు నిర్మాతలు మొహం చాటేసేవాళ్ళు ? అటు తరువాత కృష్ణ ఎలా ఎదిగారంటే ?
పొలిమేర 2 సినిమాలో ఉన్న ఆ గుడి నిజంగానే ఉందా? అందులో నిధులు ఉన్నాయా?