Advertisement
అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల పెళ్ళి త్వరలో జరగబోతోంది అయితే ఇప్పటికే ఈ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ ని ఘనంగా నిర్వహించారు. ఎంతో మంది ప్రముఖులు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నారు ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి ప్రీ వెడ్డింగ్ వేడుకల్ని అత్యంత ఘనంగా జరిపిస్తున్నారు. ముకేశ్ అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ లో రాధిక మర్చంట్ స్పీచ్ ఇచ్చారు ప్రస్తుత వైరల్ అవుతోంది. అందరికీ హాయ్ అనంత్ చెప్పినట్లు మీరు అంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ప్రపంచంలోనే ఎన్నో దేశాల నుండి మీరంతా ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అనంత్ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము.
Advertisement
జాంనగర్లో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. మా కుటుంబాల కష్టం నీతా ఆంటీ అంకిత భావం వలన కలలు నిజమయ్యాయి మాకు చాలా సంతోషంగా ఉందని రాధిక మర్చంట్ అన్నారు. అలానే లోపలికి రాగానే నాకు కూడా ఏదో పెద్ద సర్ప్రైజ్ లాగా అనిపించింది. నీతా ఆంటీ లాంటి అత్తగారు ఉండడం అదృష్టమని అందరూ అంటున్నారు అని రాధిక అన్నారు. ఈ పెళ్లి ఏర్పాట్లలో భాగంగా మా కోసం ఇంత గొప్పగా ఈ వేడుక ఏర్పాటు చేసినందుకు థాంక్యూ సో మచ్ అని అన్నారు. నేను చాలా లక్కీ ఎందుకంటే ప్రపంచంలోనే చాలా గొప్ప మహిళల్లో కొందరు మా చుట్టూ ఉన్నారని అన్నారు పిల్లల కోసం స్వర్గాన్ని కూడా భూమి పైకి తీసుకు రాగల శక్తిమంతురాలు నీత ఆంటీ అని రాధిక అన్నారు. ఈషా అందర్నీ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు శ్లోక ఎంతో ప్రేమగా ఉంటారు.
Advertisement
నువ్వు లేకపోతే నేనులేనేమో శ్లోక, అంజలి. నా జీవితంలో జరిగిన ప్రతి మంచి వెనుక నువ్వు ఉంటావు అని రాధిక మర్చంట్ అన్నారు. ఎలాంటి కష్టంలో ఉన్న ఎదిరించి పరిష్కారం కనుక్కోగలిగే నైపుణ్యాన్ని మాకు అలవాటు చేశారు థాంక్యూ అని రాధిక అన్నారు. మా ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా చాలా ప్రత్యేకమైన వారన్నారు. నాన్న మీరు నాలో ఆత్మవిశ్వాసం నింపారు మీ చుట్టూ ఉన్న ముగ్గురు మహిళల్లో ప్రేమ ఆప్యాయతలతో నమ్మకాన్ని కలిగించారు ఒక తండ్రిగా భర్తగా మీ పాత్రను చూడడం వలన నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ విషయం మీకు కూడా తెలియకపోవచ్చు అని రాధిక అన్నారు నా సోదరులు ముగ్గురు నా జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపారు ఏ సమయంలోనైనా నాకు మీరు ఉన్నారనే నమ్మకం కలిగించారు అందుకే మీ ముగ్గురు నాకు చాలా ఇష్టం అని రాధిక అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!