Advertisement
టీమిండియా T20 వరల్డ్ కప్ ని సాధించింది. అయితే కప్పు గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనం రాఘవేంద్ర ద్వివేది గురించి మాట్లాడుకోవాలి. ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తని తన తండ్రికి మాత్రం క్రికెట్ అస్సలు నచ్చదు. ఒకరోజు క్రికెట్ కావాలని మొహమాటం లేకుండా చెప్పేసి చేతిలో బ్యాగు జేబులో 25 రూపాయలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. 24 ఏళ్ల క్రితం ఇది జరిగింది. గుళ్లో ఉంటూ ప్రసాదంతో కడుపుని నింపుకున్నారు. ఓనాడు కుడి చేయి విరిగింది. క్రికెట్ ఆడాలన్న కల ముగిసిపోయింది ఇక ఇలా కాదని హుబ్లీలో స్టేడియంలో ప్రాక్టీస్ చేసే క్రికెటర్లకు బంతులు విసరడం ప్రాక్టీస్కు ఏ సహాయం కావాలని చేయడం ఇలా చేసేవారు.
Advertisement
ఒకరోజు ఒక దోస్త్ దొరికాడు తనతో కలిసి బెంగళూరు వెళ్ళిపోయాడు అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ తనకు ఆశ్రయం ఇచ్చింది. కర్ణాటక మాజీ వికెట్ కీపర్ ప్రస్తుత అండర్ 19 సెలెక్షన్ కమిటీ చీఫ్ తిలక్ నాయుడు అతని పనిని గమనించి మరొక కర్ణాటక మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ కి పరిచయం చేశాడు. ఇది రాఘవేంద్ర జీవితంలో ఒక పెద్ద మలుపు శ్రీనాథ్ కర్ణాటక రంజి టీములోకి రావాల్సిందిగా ఆహ్వానించి అడుగు క్రికెట్ సీజన్లో కర్ణాటక జట్టుతో కలిసి పనిచేసి, పని లేనప్పుడు చిన్న స్వామి స్టేడియం సమీపంలో జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలు అందించాడు.
Advertisement
Also read:
డబ్బులు లేకపోవడంతో అతను తరచుగా ఆహారం లేకుండా ఉండేవాడు. ప్రాక్టీస్ కి వచ్చిన భారత జట్టు క్రికెటర్లలో ఫేవరెట్ గా మారాడు. సచిన్ టెండూల్కర్ రాఘవేంద్ర ప్రతిభను గుర్తించారు. 2011లో భారత జట్టులో శిక్షణ సహాయకుడిగా అతని నియామకాలకి దారి తీసింది గత 13 ఏళ్లుగా జట్టు విజయంలో రాఘవేంద్ర ముఖ్య పాత్ర పోషించారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కోహ్లీ నా విజయం వెనుక ఇదిగో ఈయన శ్రమ పాత్ర ఎంతో ఉందని.. ఎవరు గుర్తించకపోయినా ఇది నిజం అని ఆయన చెప్పారు. క్రికెటర్లకు సహాయం చేసి రాఘవేంద్ర తెర వెనుక ఎంతో పెద్ద పాత్ర పోషించారు. రాఘవేంద్ర గురించి విన్నవారంతా శభాష్ అంటున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!