Advertisement
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైపోయాయి. మొదటి రోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి, YCP అధ్యక్షుడు జగన్ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మద్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేతలు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని దాని గురించి అందరూ ఆరా తీస్తున్నారు. అయితే ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు సమావేశాలు జరిగిన అన్ని రోజులు సభకు రావాలని జగన్ ని కోరారు.
Advertisement
జగన్ సమావేశాలకు హాజరవుతానని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ లాబీల్లో ఈ సీన్ కనపడింది. జగన్ వెళుతుండగా రఘురామ చొరవ తీసుకొని పలకరించారు ప్రతిరోజ అసెంబ్లీకి రండి అని చెప్పారు. ప్రతిపక్షం లేకపోతే ఎలా అని జగన్ చేతు లో చేయి వేసి మాట్లాడారు. అసెంబ్లీకి రెగ్యులర్ గా వస్తా చూస్తారుగా అని జగన్ సమాధానం చెప్పారు. తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ రఘురామను కోరారు. తప్పనిసరిగా అని కేశవ్ నవ్వుకుంటూ వెళ్ళారట అలాగే రఘురామను వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పలకరించారు.
Advertisement
Also read:
Also read:
రఘురామ గతంలో వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున నరసాపురం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తర్వాత కొంతకాలానికి రఘురామ అప్పటి వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్ తీరుపై, ప్రభుత్వం పై విమర్శలు చేసారు. తర్వాత రఘురామ అరెస్ట్ వంటి పరిణామాలు జరగడంతో ఆ పార్టీకి దూరమయ్యారు. 2024 ఎన్నికల ముందు రఘురామ TDPలో చేరారు. ఉండి నుండి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!