Advertisement
భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ వెంట అడుగులో అడుగేస్తూ కాంగ్రెస్ శ్రేణులు ముందుకు కదులుతున్నారు. మంగళవారం యాత్ర హైదరాబాద్ లోకి ఎంటర్ అవుతుంది. నగరంలో రాహుల్ యాత్రను సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలు భారీ ప్రణాళికలే వేశారు. అయితే.. సోమవారం చేసిన పాదయాత్రలో కొన్ని సంఘటనలు జరిగాయి.
Advertisement
తెలంగాణలోకి యాత్ర ప్రవేశించాక రాహుల్ మరింత దూకుడు పెంచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం చిన్నారులతో కలిసి పరుగు పందెం ఆడిన ఆయన.. సోమవారం అదే జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. సోమవారం యాత్ర ముగింపు సమయంలో ఆర్టీసీ కార్మికులతో మాట్లాడేందుకు పార్టీ నేతలు ప్లాన్ చేశారు. అయితే.. ఈ భేటీ బస్సు టాప్ పైన ఏర్పాటు చేశారు.
Advertisement
బస్సు డ్రైవర్, కండక్టర్లను అప్పటికే టాప్ పైకి ఎక్కించారు. వారితోపాటు కొందరు నేతలు ఎక్కగా.. వెనకాలే రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఆయన పైకి ఎక్కగానే… దేశ్ కీ నేత రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. అయితే.. సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డి చేతిని పక్కకు తోశారు. కెమెరామెన్ ఫోటోలు తీస్తున్నారుగా.. మీరెందుకు అన్నట్టు ఫోన్ ను పక్కకు నెట్టారు.
మరోవైపు రాహుల్ శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఓ వ్యక్తి రాహుల్ కాళ్లను పట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆ వ్యక్తిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరిపై ఆగ్రహించిన రాహుల్.. వారిపై నిస్సహాయతను వ్యక్తం చేశారు. దీనికి పోలీసుల వైఫల్యమే కారణమంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీనిపై డీసీపీ సందీప్ స్పందించారు. అందులో ఎలాంటి భద్రతా లోపం లేదని చెప్పారు. రాహుల్ గాంధే రమ్మని పిలిచారని.. అక్కడ ఉన్న పోలీసులు తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు.