Advertisement
జోడోయాత్రతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగిన ఈ యాత్రలో దాదాపు కాంగ్రెస్ నేతలంతా పాల్గొన్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ రాహుల్ మాటల తూటాలు పేల్చారు. బాగా గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపించారు. యాత్ర పూర్తయ్యే దాకా షేవ్ చేసుకోకుండానే ఉన్నారు. అయితే.. రాహుల్ తాజాగా లుక్ మార్చారు.
Advertisement
ట్రిమ్ చేసిన గడ్డం.. హెయిర్ కట్.. అచ్చం ఓ యంగ్ ప్రొఫెసర్ లా కనిపించారు. బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వనున్నారు రాహుల్ గాంధీ. ‘లెర్నింగ్ టు లిజెన్ ఇన్ ది 21 సెంచరీ’ అనే అంశంపై విశ్వవిద్యాలయంలో రాహుల్ ఉపన్యాసం ఉండనుంది. 21వ శతాబ్దంలో మనముందున్న సవాళ్లు అన్నదే దీని ఉద్దేశం.
Advertisement
తన లెక్చర్ సందర్భంగా ఇండియాలో తాను చేపట్టిన సుదీర్ఘమైన భారత్ జోడో యాత్ర గురించి రాహుల్ వివరించనున్నారు. ఇంగ్లండ్ సహా యూకేలోని వివిధ నగరాల్లో వారం రోజుల పాటు రాహుల్ పర్యటన ఉండనుంది. ఈ నెల 5న లండన్ లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ కొత్తలుక్ ఫొటోలను కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇవి చూసిన కాంగ్రెస్ శ్రేణులు జోడో యాత్ర సందర్భంగా దృఢంగా, శక్తిమంతంగా కనిపించారని.. ఇప్పుడు నగిషీ చెక్కిన శిల్పంలా నాజూకుగా ఉన్నారని సంబరపడుతున్నారు. నవతరం రాజకీయవేత్తకు సరైన ఉదాహరణ రాహుల్ గాంధీయే అని కామెంట్లు పెడుతున్నారు.