Advertisement
Railway recruitment and Jobs 2023:ఇండియన్ రైల్వే ఢిల్లీలోని రైల్వే బోర్డులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తికర అభ్యర్థులు అప్లై చేసుకోవాలని అంటోంది.. భారతీయ రైల్వేలో ఉద్యోగుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) మాత్రమే కాదు రైల్వే కూడా పలు నోటిఫికేషన్లు జారీచేస్తుంది. రైల్వేలో పలు ఖాళీల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ వేసింది. అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 12 ఖాళీలు ఉండగా, ఇవి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి పోస్టులు. డిప్యూటేషన్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్నది రైల్వే శాఖ. ముందుగా వీరిని మూడు సంవత్సరాల కాలానికి నియమించి, ఆ తర్వాత గడువు పొడిగించే అవకాశం ఉన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. రైల్వే అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్ కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. రైల్వే కి చెందిన జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన, పూర్తి వివరాలు ఈ క్రింద ఉన్నాయి చూడండి..
Advertisement
Also Read:తధాస్తు దేవతలంటే ఎవరు.. వారేం చేస్తారంటే..?
Advertisement
విద్యార్హతలు :
కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్ డిగ్రీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ లేదంటే బీటెక్ పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి అధికారులు, సెమీ గవర్నమెంట్, అటానమా సంస్థల్లో పనిచేస్తున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అభ్యర్థుల వయసు 56 ఏళ్లలోపే ఉండాలి.
Also Read: VASTU: ఉగాదిలోగా వీటిని తొలగించకుంటే సమస్యలే..?
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: Deputy Secretary, Room No. 110-C Rail Bhawan Raisina Road, New Delhi- 110001. ఎంపికైనవారికి న్యూ ఢిల్లీలో పోస్టింగ్ లభిస్తుంది. ఎంపికైనవారికి రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది. న్యూ ఢిల్లీలో భారతీయ రైల్వేకు చెందిన రైల్వే బోర్డులో ఈ పోస్టులు ఉన్నాయి. 2023 మార్చి 2న నోటిఫికేషన్ విడుదలైంది. 60 రోజుల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ చివరి నాటికి దరఖాస్తుల్ని పంపాలి. అప్లికేషన్ ఫామ్ https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంటుంది.
Also Read:పొత్తులపై జగన్ సంచలన వ్యాఖ్యలు