Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా మంచి పేరుని తెచ్చుకున్నారు. రాజమౌళి ఎన్నో మంచి హిట్ సినిమాలని తెర మీదకి తీసుకువచ్చారు. రాజమౌళి పలు టాప్ హీరోలకి సూపర్ హిట్ లని కూడా అందించారు. నిజానికి రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది హీరోలు కలలు కంటూ ఉంటారు. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి, మగధీర, బాహుబలి, ఈగ, ఆర్ఆర్ఆర్ ఇవన్నీ కూడా పెద్ద హిట్లు అయ్యాయి.
Advertisement
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకంగా ఆస్కార్ ని కైవసం చేసుకుంది ఈ సినిమా. రాజమౌళి 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమాతో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు గొప్ప దర్శకుడిగా దూసుకుపోతున్నారు. అయితే రాజమౌళి తెర మీదకి తీసుకువచ్చిన అన్ని సినిమాలు కూడా వండర్ ని క్రియేట్ చేసాయి. కానీ ఈ ఒక్క సినిమా మాత్రం రాజమౌళిని కొంచెం ఇబ్బంది పెట్టిందట.
Advertisement
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 2004లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కథ పరంగా అందరిని బాగానే ఆకట్టుకుంది దాదాపు 8 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తీసుకువచ్చారు. ఈ సినిమాకి 12 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. కమర్షియల్ గా సినిమా హిట్ అయింది.
కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదట. దానితో రాజమౌళి కాస్త బాధపడ్డారట. చిన్నపాటి నష్టాలు డిస్ట్రిబ్యూటర్లకు వచ్చాయని టాక్. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మీద మహేష్ ఫ్యాన్స్ అయితే మాత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురుచూస్తున్నారు.
Also read: