Advertisement
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్భుతమైన సినిమాలని తీసుకొచ్చారు రాజమౌళి. మహేష్ బాబుతో ప్యాన్ వరల్డ్ సినిమాకు జక్కన్న ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్లో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ సినిమా కోసం తన లుక్స్ ని మార్చుకున్నారు మహేష్ బాబు. రీసెంట్ గా ఫారెన్ నుంచి వచ్చిన మహేష్ న్యూ లుక్ కనిపించకుండా మేనేజ్ చేశారు. అయితే లాంగ్ హెయిర్ తో గడ్డం పెంచుకొని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు.
Advertisement
ఈ సినిమా ఓపెనింగ్ త్వరలోనే ఉండొచ్చు అని టాక్ కూడా నడుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ గా ప్రకటన రాబోతోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతోంది. రెండు భాగాలకు ఈ సినిమాని తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. బడ్జెట్ తో పాటుగా ఈసారి టైం కూడా క్రాస్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.
Advertisement
Also read:
ఈ మూవీని 2026 లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మహేష్ బాబుతో సినిమా అంటే ఎప్పుడు పూర్తవుతుంది అని చాలామంది ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అంటే అప్డేట్స్ కోసం గట్టిగా ప్రెషర్ ఉంటుంది. కాస్త లేటుగా అయినా సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పదు. సినిమా చేయాలి అంటే టైమ్ పడుతుంది. పాన్ వరల్డ్ మూవీ కనుక చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ టైమ్ లో చికాకులు ఉంటే కష్టం అందుకే ముందే ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చేస్తున్నాడట జక్కన్న. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటున్నారు. దీపికా పదుకొనే, కృతి సనన్ లాంటి మరికొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!