Advertisement
2015లో విడుదలైన తెలుగు సినిమా బాహుబలి సినిమా ప్రేక్షకులను పిచ్చెక్కించింది. దాని అద్భుతమైన కథ, బలమైన సంభాషణలు మరియు అద్భుతమైన స్క్రీన్ప్లే కారణంగా, ‘బాహుబలి’… ఉత్తర భారతదేశం, దక్షిణాదిలో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై దాదాపు రూ.1800 కోట్ల వరకు కలెక్షన్ అని కొల్లగొట్టింది. దాంతో ఈ మూవీ మూడో భాగంగా ‘బాహుబలి 3’ వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది.
Advertisement
అయితే, అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ తెరమీదకి రావడం సంచలన విజయం అందుకోవడం, వెంటనే మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా అంటూ ప్రచారం జరగడంతో ఆ ప్రచారం కొద్దిగా సద్దుమణిగింది. ఈ తరుణంలోనే అమెరికాలో లాస్ ఏంజిల్స్ మూవీ మారధాన్ ఈవెంట్ జరుగుతోంది. సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ ఈవెంట్ అక్టోబర్ నిలాఖరు వరకు జరగనుంది. ఈవెంట్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్, బాహుబలి, ఈగ ప్రదర్శించారు. త్వరలో మరికొన్ని మూవీస్ ని ప్రదర్శించనున్నారు. ఈ ఈవెంట్ లోనే రాజమౌళితో ‘క్యూ అండ్ ఏ’ సెషన్ ని ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించింది. అందులో భాగంగా ‘బాహుబలి 3’ తీస్తానని చెప్పినట్లు అనూప్ దాసరి అనే ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
Advertisement
ఆయన చేసిన ట్వీట్ లో, ‘మూవీ మారథాన్ తర్వాత ప్రశ్నోత్తరాల సెషన్ లో రాజమౌళి మాట్లాడారు. ఆయన చేసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా క్లైమాక్స్ లో మాత్రం ఓపెన్ ఎండ్ గా ఓ సంభాషణని పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అది బాహుబలి 2 ఎండ్ క్రెడిట్ లోనే, అక్కడ ఒక చిన్న అమ్మాయి వాయిస్ ఓవర్ ఉంది. అది బాహుబలి 3 కోసం సూచన. మీలో ఎంతమంది దానిని గమనించారు? #Bahubali #Bahubali3’ అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ‘నేను చూశాను’ అంటూ కొందరు, ‘అవునా వుందా’ అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. మరి కొందరేమో బాహుబలి 2 క్లైమాక్స్ తర్వాత పేర్లు పడుతున్నప్పుడు, ఈ సినిమాలో స్వామీజీ వేషం వేసిన తనికెళ్ల భరణికి, ఓ పాపకి జరిగిన సంభాషణకి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. అందులో, ‘అంటే తాత, మహేంద్ర బాహుబలి కొడుకు రాజయ్యాడా’ అని ఓ పాప అడుగుతుంది. దానికి సమాధానం, ‘ఏమో, శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటి ఎరుక’ అని తనికెళ్ళ రిప్లై ఇచ్చాడు. అది చూసిన పలువురు అభిమానులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
In Q&A session after the Movie Marathon, #Rajamouli said that he left only one “open-ended conversation” out of all his films. That is during Bahubali 2 end credits, there is a voice over of a small girl, hinting for Bahubali 3. How many of you observed that? #Bahubali #Bahubali3
— Anup Dasari (@anupdasari) October 3, 2022
Read also : ఎన్టీఆర్ ట్రస్ట్ వివాదంపై ఎన్టీఆర్ కి రాసిన ఓపెన్ లెటర్ ! అతను చెప్పేది నిజామా కాదా ?