Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యెక్కించి చెప్పక్కర్లేదు. రాజమౌళి అందరికీ సుపరిచితమే. ఇప్పటికే చాలా మంది హీరోలకి సూపర్ హిట్లని ఇచ్చారు. టాలీవుడ్ లో మాత్రమే కాదు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా రాజమౌళి దూసుకు వెళ్లిపోతున్నారు. ఇప్పటి దాకా దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా ఒక సినిమాకు మించి మరో సినిమా ఉంటుంది. అలా ట్రెండ్ సెట్ చేసేసారు.
Advertisement
ఆయన కలెక్షన్లను ఆయన రికార్డులను ఆయనే బద్దలు కొట్టేశారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ పదిన ఆయన పుట్టినరోజు కావడంతో ఆయనకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పటిదాకా ఒక ఫ్లాప్ సినిమా కూడా ఆయన చూడలేదంటే ఏ రేంజ్ లో సంపాదించి ఉంటారో మనం ఊహించుకోవచ్చు. జక్కన్న సంపాదన విషయానికి వచ్చేస్తే రాజమౌళి సంపాదన మొత్తం దాదాపు 158 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
Advertisement
Also read:
సినిమాలతో పాటుగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ బానే సంపాదించారు. రాజమౌళి పంజాగుట్ట లో ఒక విల్లాను కొన్నారు 2008లో దీనిని తీసుకున్నారు. ప్రస్తుతము ఆయనకు కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయి. రాజమౌళి దగ్గర రేంజ్ రోవర్, బిఎండబ్ల్యూ వంటి కార్లు కూడా ఉన్నాయి. రాజమౌళి రెమ్యునిరేషన్ విషయానికి వస్తే బాహుబలి మూవీకి 25 కోట్లు తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు 100 కోట్లు తీసుకున్నారు అని తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి