Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాజమౌళి అందరికీ సుపరిచితమే, తెలుగు సినిమా ఇండస్ట్రీని వేరే లెవెల్ కి తీసుకువెళ్లారు. ఆయన తెరకెక్కించిన బాహుబలి 2 రికార్డ్స్ కొన్ని ఇప్పటికి అలానే ఉండిపోయాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా బాహుబలి 2 రికార్డులకు ఎక్కింది. రాజమౌళి సినీ ప్రస్థానం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైంది. రెండు దశాబ్దాలుగా రాజమౌళి చేసింది 12 సినిమాలే కానీ ఆయన తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతల్ని పెంచేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు ఆయన దాదాపు 10 ఏళ్ల సమయం తీసుకున్నారు.
Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ఆస్కార్ ని కూడా అందుకుంది. ఇండియాస్ నెంబర్ వన్ దర్శకుడుగా ఉన్న రాజమౌళి పై డాక్యుమెంటరీని రూపొందించారు. మోడ్రన్ మాస్టర్స్ రాజమౌళి పేరుతో ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. రాజమౌళిని ఉద్దేశిస్తూ ప్రముఖులు చేసిన కామెంట్లు, దర్శకత్వ ప్రస్థానం గురించి ఆ డాక్యుమెంటరీ లో చూపించారు. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి దేవుడిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. రాజమౌళి దేవుడిని నమ్మరట మోడ్రన్ మాస్టర్ డాక్యుమెంటరీ లో ఆయన మాట్లాడుతూ దేవుడిని నమ్మని వారు నీతి నిజాయితీతో ఉంటారని.. అందుకే నా భార్యకు ప్రమాదం జరిగి చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడిని మొక్క లేదని అన్నారు.
Advertisement
Also read:
దేవుడిని నమ్మని వాళ్ళు నీతి నిజాయితీతో ఉండడం అనడం ద్వారా పరోక్షంగా దేవుడిని నమ్మే వారిని కించపరిచినట్లు అయింది. అంటే దేవుణ్ణి దేవుడు ఉన్నాడని నమ్మే వారిలో నిజాయితీ ఉండదని రాజమౌళి చేసిన కామెంట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంత మాత్రాన భగవంతుడిని పూజించే వారిని కించపరిచేలా మాట్లాడటం సరికాదని అంతా అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!