Advertisement
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుపులల చాటిన దర్శకుడు రాజమౌళి.. ఇప్పటికే ఆయన బాహుబలి సినిమాతో అనేక రికార్డులు కొల్లగొట్టారు. మళ్లీ ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును దేశం నలుమూలలా చాటారు. అలాంటి దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా నటించిన మూవీ ఆర్ఆర్ఆర్..ఇది థియేటర్ లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.
Advertisement
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ చేయడానికి మాయాబజార్, బ్రేవ్ హార్ట్ సినిమాలు ప్రేరేపించాయని అన్నారు. మాయాబజార్ మూవీలో మాట్లాడే భాష మహాభారతంలోని భాష అని గతంలో వచ్చిన నాటకాలు. సినిమాలు సినిమాల్లోని పాత్రల కోసం పుస్తకభాషను ఎక్కువగా వాడటం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. డైరెక్టర్ ఏదైనా చేయగలరని నేను నమ్ముతానని రాజమౌళి అన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నిజమైన పాత్రలతో ఉన్న కల్పిత గాథ అని ఈ సినిమాకు మాయాబజార్ మూవీ స్ఫూర్తినిచ్చిందని రాజమౌళి వెల్లడించారు. మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ ఆధారంగా ఎన్టీఆర్ కొమరం భీముడో సాంగ్ షూట్ చేశామని ఆయన తెలిపారు.
Advertisement
నాకు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ నచ్చలేదని ఆయన కామెంట్ చేశారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే క్లారిటీ లేకపోయినా ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అభిప్రాయాలు ఉన్నాయి. రాజమౌళి డిమాండ్ చేస్తే ఏ రేంజ్ లో అయినా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. రాజమౌళి మాత్రం రెమ్యూనరేషన్ కంటే మంచి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?