Advertisement
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మెచ్చిన దర్శకుడు, ఇప్పటివరకు ఫ్లాప్ ఎరగని ధీరుడు ఎవరైనా ఉన్నారంటే మొదటగా గుర్తుకు వచ్చే పేరు దర్శకుడు రాజమౌళి. ఈయన టాలెంట్ కి ఎంత పారితోషికం ఇచ్చినా తక్కువేనని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శాంతినివాసం అనే సీరియల్ ద్వారా దర్శకుడిగా తన కెరీర్ అని ప్రారంభించిన ఈయన ప్రస్తుతం వరల్డ్ వైడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. శంకర్ శిష్యుడిగా ప్రస్థానం కొనసాగించిన రాజమౌళి ప్రస్తుతం గురువుని మించిన శిష్యుడిగా తన సినిమాల నిర్మాణంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
Advertisement
Read also: ఈ లక్షణాలున్న అబ్బాయి లను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?
ఇదిలా ఉంటే.. రాజమౌళి భార్య రమా రాజమౌళి గురించి, వారి లవ్ స్టోరీ గురించి చాలామందికి తెలియదు. రాజమౌళి చేస్తున్న సినిమాలలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది రమా రాజమౌళి. వాస్తవానికి రాజమౌళి, రమా రాజమౌళి ఇద్దరిదీ ప్రేమ వివాహం. రాజమౌళి ని పెళ్లి చేసుకోవడానికంటే ముందే రమకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వారి దాంపత్యానికి గుర్తుగా కార్తికేయ కూడా జన్మించాడు. ఆ తర్వాత అభిప్రాయ భేదాలు రావడంతో రమా తన కుమారుడితో విడిగా జీవించడం మొదలుపెట్టింది. ఈ రమ కీరవాణి భార్య వల్లి సోదరి, దగ్గరి బంధుత్వం ఉండడంతో రాజమౌళి, రమా ఇద్దరికీ సాధారణ పరిచయం ఏర్పడింది. ఇక రాజమౌళి స్టూడెంట్ నెం.1 సినిమా డైరెక్ట్ చేసే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆమెకు అప్పటికే వివాహం జరిగి ఒక కుమారుడు ఉన్నాడన్న విషయాన్ని కూడా తెలిసి రాజమౌళి ఆమెను వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
చాలా సాదా సీదాగా వివాహం చేసుకున్న తర్వాత కూడా కార్తికేయను తన సొంత కుమారుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ వచ్చారు రాజమౌళి. అయితే ఒకవేళ తమకు సంతానం కలిగితే కార్తికేయను సరిగ్గా చూసుకోలేమన్న ఉద్దేశంతో వీరు సంతానాన్ని కూడా కోరుకోలేదని చెబుతూ ఉంటారు. ఇక రాజమౌళి ఒకానొక సందర్భంలో ఒక ఆడపిల్లను దత్తత తీసుకొని ఆమెను పెంచుతూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ కూడా ఒక క్రేజీ విషయాన్ని లీక్ చేశాడు. ” మా అమ్మను రాజమౌళి గారు పెళ్లి చేసుకోకముందే మా ఇంటికి వస్తు పోతూ ఉండేవారు. పెళ్లి చేసుకునే నెలరోజుల ముందు నుండి కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. అప్పుడే నాకు నాన్న అనే ఫీలింగ్ కలిగింది ” అంటూ క్రేజీ న్యూస్ లీక్ చేశాడు.
Read also: పొరపాటున కూడా ఇంటి ఈశాన్య దిక్కున ఉంచకూడని వస్తువులు ఇవే ! పొరపాటున ఉంచారో..!