Advertisement
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ టీడీపీ లో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. అధినేత అరెస్ట్ అయ్యి ఉండడంతో.. పార్టీ బాధ్యతలను అటు నారా లోకేష్ ఇటు నందమూరి బాలకృష్ణ తమ భుజ స్కంధాలపైకి ఎత్తుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించలేదు అంటూ కామెంట్స్ వచ్చాయి.
Advertisement
నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టింది అంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, తెలుగు దేశం పార్టీ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఇప్పటివరకు తన వంతు సాయం అందిస్తూనే వచ్చాడు. కుటుంబ సభ్యులతో సఖ్యత లేకున్నా.. పార్టీ విషయంలో మాత్రం ఎన్టీఆర్ తన సాయం అందించారు. చివరకు ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన కొడాలి నాని పార్టీ వీడినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించారు. కట్టె కాలేవరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటానని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం స్పందించకపోవడం అనేక చర్చలకు తావిస్తోంది.
Advertisement
ఈ విషయమై ఓ విలేఖరి రాజీవ్ కనకాలను అడగగా.. ఎన్టీఆర్ కు రాజకీయాలపై ఆసక్తి ఉంటె ఆయనే సమాధానం ఇస్తారని అన్నారు. గతంలో చాలా సార్లు పార్టీ తరపున ప్రచారంలో పాల్గొని అందరిని ఉర్రూతలూ ఊగించాడని.. ఇప్పుడు అతని దృష్టి అంతా కెరీర్ పైనే ఉందని రాజీవ్ కనకాల అన్నారు. అందుకే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల మీద కంటే సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని అన్నారు. కానీ సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా నెగటివిటీ వస్తోందో.. లేదంటే అనుకోకుండానే వస్తోందో తెలియడం లేదని అన్నారు. ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు కచ్చితమైన కారణం నాకు తెలియదు అని అన్నారు. నటన అంటే ఎన్టీఆర్ కి ఇష్టం అని.. కరోనా, ఆర్ ఆర్ ఆర్ సినిమా కారణాలతో నాలుగేళ్ళ గ్యాప్ వచ్చిందనీ.. అది భర్తీ చేసుకోవడానికే సినిమాల్లో బిజీ అయ్యాడని.. ఆ బిజీ వలనే స్పందించి ఉండకపోవచ్చని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
మరిన్ని..
భార్యలు ఈ 5 సూత్రాలు పాటిస్తే.. భర్తలు పొరపాటున కూడా మరో అమ్మాయిని చూడరు!
చంద్రబాబు నాయుడుకు జైలులో ఎలాంటి ఆహరం పెడతారు? ఆయనకు ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ ఏంటంటే?