Advertisement
యాంకర్ సుమ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సుమ చాలా షోలతో బిజీగా ఉంటుంది. ఆడియో ఫంక్షన్స్, ప్రోగ్రామ్లు అంటూ ఎప్పుడూ కూడా ఫుల్ బిజీగా ఉంటుంది సుమ. రాజీవ్ కనకాల, సుమ భార్యాభర్తల అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్లి చేసుకుంది సుమ. అయితే చాలా రోజుల నుండి వీళ్ళిద్దరూ విడిపోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా సుమ, రాజీవ్ కనకాల విడిపోబోతున్నారా.. ఈ విషయంలోకి వచ్చేస్తే రాజీవ్ కనకాల తాజాగా ఈ విషయంపై ఓపెన్ అయ్యారు.
Advertisement
Advertisement
విడాకులు వార్తలు తనకి కొత్త కాదని ఎన్నో వార్తలు ఇప్పటికే పుట్టించారని రాజీవ్ చెప్పారు మా ఇద్దరి మధ్య అలా ఏమీ లేదని చెప్తున్నా కూడా వినడం లేదని.. ఈ విషయం అమ్మానాన్నలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఎక్కువ బాధపడి ఉండే వాళ్ళమని చెప్పారు. సుమ అయితే ఇటువంటి వార్తలను పెద్దగా లెక్క చెయ్యదు అని.. నేను మాత్రం అంత లైట్ తీసుకోనని చెప్పారు. కానీ ఇటువంటి రూమర్లు బాగా అలవాటు అయిపోయాయని చూసి చూసి చిరాకు వస్తుందని చెప్పారు. కానీ పిల్లల్ని స్కూల్లో కాలేజీలో ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళకి ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది కదా అని రాజీవ్ కనకాల బాధపడ్డారు. సుమ నేను కలిసే ఉన్నాము విడిపోలేదని చెప్పుకొచ్చారు.
Also read: