Advertisement
సీనియర్ నటి రమ ప్రభా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెండితెరపై దశాబ్ద కాలం పాటు అద్భుతమైన నటన ప్రదర్శించిన వారిలో రమాప్రభ కూడా ఒకరు. తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లో కలిపి సుమారు 1400 కి పైగా చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ప్రముఖ హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రుమా ప్రభ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. ఆ కాలంలో తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రమాప్రభ 1946 మే 5న అనంతపురం జిల్లాలోని కదిరిలో జన్మించింది. ఈమె కొట్టి చిన్నమ్మ, గంబిశెట్టి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించింది.
Advertisement
Read also: మీ పేదరికానికి ఈ మొక్కలు కారణం కావచ్చు
Advertisement
హాస్యనటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమప్రభ ఎన్నో సినిమాలలో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడిగా నటించింది. సినీ పరిశ్రమలో శరత్ బాబు మరియు రమ ప్రభలకు మంచి పేరు ఉండేది. యవ్వన వయసు నుంచే సినిమా పరిశ్రమలో రాణించి ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న వీరు చాలా సినిమాలకు కలిసి పనిచేశారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీయగా అది కాస్త పెళ్లి దాకా వెళ్ళింది. ఆ తరువాత అతని వల్ల మోసపోవడమే కాకుండా.. తాను సంపాదించుకున్న ఆస్తిని మొత్తం పోగొట్టుకుందట. చివరికి కట్టుబట్టలతో రోడ్డున పడిన రోజున.. సహాయం కోసం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి వెళ్లిందట రమాప్రభ.
అయితే రజనీకాంత్ రీల్ మీద ఎలా ఉన్నప్పటికీ.. నిజజీవితంలో మాత్రం ఎంతో నిరాడంబరుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచే రూపం ఆయన. గతంలో సాయం కోసం ఆయన ఇంటి గుమ్మం తొక్కిన ఎంతో మందికి ఆయన సహాయం చేశారు. ఆ లిస్టులో రమప్రభ కూడా ఉందట. అలా రజినీకాంత్ ఇంటికి వెళ్ళిన రామప్రభ పరిస్థితిని చూసిన రజిని.. అప్పటి రోజుల్లోనే తన దగ్గర ఉన్న 40 వేల రూపాయలను ఇచ్చేసారట. ఎంతో కొంత సాయం చేస్తారని వెళ్లిన రమాప్రభకు.. రజిని ఇచ్చిన డబ్బు చాలా కష్టాల నుంచి బయటపడేసిందట. ఆ విషయాన్ని రమప్రభ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
Read also: ఆ కారణంగానే పిల్లలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయలేదు – చంద్రమోహన్