Advertisement
సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. చాలామంది హీరోలు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కథ నచ్చక కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే.. పాత్ర నచ్చినా వేరు వేరు కారణాల వల్ల హీరోలు మరికొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలా హీరోలు రిజెక్ట్ చేసిన కథలు రికార్డులను క్రియేట్ చేస్తాయి. ఆ తర్వాత ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా అని బాధపడుతూ ఉంటారు. అలా కొన్ని సినిమాలను మిస్ చేసుకున్న హీరోలు బాధపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలా మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్ లో చాలా సినిమాలను మిస్ చేసుకున్నారు.
Advertisement
Read also: ప్రభాస్ తండ్రి, తారకరత్న, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికి ఉన్న కామన్ పాయింట్ ఇదేనా ?
Advertisement
అంతేకాకుండా చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో రజినీకాంత్ రికార్డులు క్రియేట్ చేశారు. ఆ సినిమా ఏదంటే.. మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మనిచిత్ర తాల్. 1993లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రంలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు రీమేక్ గా 2004లో కన్నడలో ఆప్తమిత్ర అనే సినిమా వచ్చింది. ఈ చిత్రంలో సౌందర్య హీరోయిన్ గా, విష్ణువర్ధన్ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని తమిళంలోనూ తీయాలని నిర్ణయించుకున్నారు. దీంతో వెంటనే ఆయన రజనీకాంత్ ని కలిసి “చంద్రముఖి” పేరుతో తీశారు.
ఇందులో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించింది. ఇదే సినిమాని తెలుగులో డబ్ చేయడంతో తెలుగులోనే బంపర్ హిట్ కొట్టింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో చేసేందుకు డైరెక్టర్ విఎన్ ఆదిత్య చిరంజీవిని సంప్రదించారట. అయితే కథ కాస్త ఎమోషన్ అండ్ హర్రర్ ఉండడంతో చిరు రిజెక్ట్ చేశారట. దీంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. కానీ చంద్రముఖి స్టోరీనే విఎన్ ఆదిత్య చెప్పిన స్టోరీ అని మెగాస్టార్ తరువాత తెలుసుకున్నాడట. ఆ సినిమా విడుదలయ్యాక చిరు విఎన్ ఆదిత్య కు ఫోన్ చేసి ఆయన జడ్జిమెంట్ ను అభినందించారు. అంత మంచి కథను మిస్ చేసుకున్నందుకు చిరు ఫీలయ్యారట.
Read also: రైళ్ల పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు ఉంటాయి ? అవి లేకుంటే కలిగే నష్టం ఇదేనా ?