Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ఆడపిల్ల కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే మెగా కుటుంబ సభ్యుల తో పాటుగా అభిమానులు కూడా అభినందలని తెలుపుతున్నారు. సోషల్ మీడియా లో కూడా రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు అంతా తెలుపుతున్నారు. 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన కి ఆడపిల్ల పుట్టింది.
Advertisement
రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అవ్వడం తో చిరంజీవి కూడా ఎంతో ఆనందించారు. చిరంజీవి ఇంటర్వ్యూ కూడా ఇచ్చి తన ఆనందాన్ని చెప్పుకొచ్చారు. ఆంజనేయ స్వామిని నమ్ముకున్నామని మంగళవారం నాడే ఆడపిల్ల పుట్టడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పారు. ఇండస్ట్రీ కి చెందిన ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ దంపతుల కి శుభాకాంక్షలు చెప్పారు.
అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి తో కలిసి అపోలో హాస్పిటల్ కి వచ్చారు. అలానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొందరు హాస్పిటల్ కి వచ్చారు. మరొక పక్క పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర లో బిజీగా ఉన్నారు అయినా కూడా తన తరుపున బంగారం గొలుసు ని పుట్టిన పాప కోసం ముందే సిద్ధంగా ఉంచారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తన పాపకి ఏం పేరు పెడతారా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Advertisement
మెగా ఫ్యామిలీ లో ఉన్న వాళ్ళందరికీ దైవ నామాలే పెట్టారు. శివుడు పేర్లు ఆంజనేయ స్వామి పేర్లు వచ్చే విధంగా పేర్లు ఉంటాయి. రామ్ చరణ్ తన కూతురి కి అంజలి అనే పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అంజలి- దేవుడికి ప్రార్థన చేయడం. ఈ పేరు రామ్ చరణ్ కి చాలా ఇష్టం. ఈ పేరు తో నటి అంజలి ఉన్న విషయం తెలిసిందే. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాల్సి ఉంది.
Also read:
పరాయి స్త్రీతో భర్త సంబంధాన్ని పెట్టుకోవడానికి… ముఖ్యమైన 3 కారణాలు ఇవే..!