Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మూడు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టేశారు. వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంలో కూడా తన ఫ్యామిలీకి ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇటీవల తన కూతురు జన్మించిన తర్వాత రామ్ చరణ్ ఎక్కువగా తన కూతురుతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు.
Advertisement
రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగిన 11 ఏళ్లకు క్లీన్ కారా జన్మించింది. కూతురు పుట్టినప్పటి నుంచి రామ్ చరణ్ ఎక్కువగా ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో చరణ్ పాల్గొన్నారు తన ఫామ్ లో 15 వరకు గుర్రాలు ఉన్నాయని తెలిపారు. మగధీర సినిమాలో నటించిన గుర్రాన్ని కూడా రాజమౌళిని అడిగి తనతో పాటు తీసుకెళ్లారట. తనకు బాద్షా అనే పేరు పెట్టారట.
Advertisement
Also read:
ఇటీవల ఈ గుర్రానికి మరో ఆడపిల్ల పుట్టిందట దానిని తన కూతురుకు కానుకకు ఇచ్చారని రామ్ చరణ్ తెలిపారు. తన కూతురు కూడా గుర్రంపై ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని ఈయన చెప్పారు. గుర్రపు స్వారీ విషయంలో తన కూతురు కూడా తనలాంటి అభిరుచిని కలిగి ఉందని రామ్ చరణ్ కామెంట్స్ చేశారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!