Advertisement
ఇండియా లో మిగిలిన పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ బాట పట్టాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావట్లేదని తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ట జరిగే వేళా బెంగాల్లోని ఆలయాలు, మసీదులు, చర్చిలని సందర్శిస్తాను అన్నారు. ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బాలరామయ్య ప్రాణ ప్రతిష్టకి హాజరు కావట్లేదు అని చెప్పారు. ప్రతిష్ట తర్వాత కుటుంబ సమేతంగా అయోధ్య వెళ్తానని అన్నారు.
Advertisement
అలానే ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు అవ్వాలని సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరికి కూడా ఆహ్వానాలు అందాయి. అయోధ్య అంటూ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయాలు చేశాయని కాంగ్రెస్ అంది. అందుకనే ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని అన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి కాలేదని, లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే ఇలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. మతం అనేది వ్యక్తిగత అంశం అని కాంగ్రెస్ అంది. ప్రధాని మోదీ చేపట్టిన రాజకీయ కార్యక్రమం ఇది అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ అన్నారు.
Advertisement
ఇక ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్ బాట పట్టాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ట జరిగేవేళ తాను బెంగాల్‌లోని ఆలయాలు, మసీదులు, చర్చీలను సందర్శిస్తానన్నారు ఆమె. ఇక ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బాల రామయ్య ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం లేదని తేల్చేశారు.
అయితే ప్రతిష్ట తర్వాత కుటుంబ సమేతంగా అయోధ్య వెళతానన్నారు ఆయన. మరోవైపు మరాఠా స్ట్రాంగ్‌మేన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్..పనుల ఒత్తిడితో ఈ కార్యక్రమానికి వెళ్లట్లేదన్నారు. 22వ తేదీ తర్వాతే అయోధ్యను సందర్శిస్తానన్నారు ఆయన. ఇక ఎస్పీ అధినేత అఖిలేష్, ఆర్జేడీ నేతలు లాలూ, తేజస్వీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదని చెప్పేశారు. మొత్తంమీద రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇండియా కూటమి దూరంగా జరిగింది.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను దేశమంతా పండుగలా జరుపుకుంటుంటే కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు బాయ్‌కాట్ చేయడం, రాజకీయంగా చర్చనీయాంశమైంది
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!