Advertisement
అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధికార వైసిపి ఘోర పరాజయాన్ని చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ సానుభూతిపరులు కార్యకర్తలు నాయకులు మీద దాడులు మొదలయ్యాయి. మాజీ మంత్రులను కూడా వదలట్లేదు. మొన్నటి ఎన్నికల్లో అటు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీకి కేవలం 11 స్థానాలు దక్కాయి. కంచుకోట లాంటి నియోజకవర్గం కూడా వైసీపీ కోల్పోయింది. విశాఖపట్నం రెండు, కర్నూల్ రెండు, చిత్తూరు రెండు, ప్రకాశం రెండు. కడప మూడు ఇవి ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య.
Advertisement
ఇదిలా ఉంటే హీరో రామ్ పోతినేని చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో హీరో రామ్ చేసిన పోస్ట్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. వైసిపి ఓటమిని ఆయన ముందే పసికట్టినట్టు అనిపించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని రోజులకే హెచ్చరించారు. పెద్ద కుట్ర జరుగుతున్నట్లు ఉంది సీఎం ని తప్పుగా చూపించడానికి కింద పని చేసే కొంత మంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వలన మీరు రిప్యుటేషన్ కి మీ మీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతుంది.
Advertisement
Also read:
Also read:
వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాను అని ఆయన పోస్ట్ చేశారు. ఈ అనుమానాన్ని వైసీపీకి చెందిన కొందరు ఓడిపోయిన ఎమ్మెల్యేలు సైతం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతమంది సీనియర్లు సోషల్ మీడియా ప్రతినిధులు జగన్ సలహాదారులను తప్పుపట్టిన విషయం తెలిసిందే. జగన్ వద్ద పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, సజల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి తో పాటుగా ఐప్యాక్ టీం ని కూడా తప్పు పట్టారు.
https://x.com/ramsayz/status/1294541106185515010
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!