Advertisement
స్కంద సినిమా ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆ సినిమాపై ఎదో ఒక రకంగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి బోయపాటి పై కూడా ఈ ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల పై ఈ ట్రోలింగ్ నడుస్తోంది. ఈ సినిమాలో పంచె కట్టులో రామ్ ఫైట్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్ లో రామ్ కి బదులుగా బోయపాటినే ఆ సన్నివేశంలో డూప్ గా నటించినట్లు వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలు చూస్తే నిజంగానే బోయపాటి, రామ్ పోతినేనికి డూప్ గా చేశాడా అని అని అందరు అనుకుంటున్నారు.
Advertisement
తాజాగా.. స్కంద సినిమా హీరో రామ్ పోతినేని ఈ ట్రోల్స్ కి సమాధానం చెప్పారు. ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డాడో వివరించాడు. అంతే కాదు.. గాయపడ్డ తన పాదాన్ని కూడా ఫోటో తీసి షేర్ చేసారు. ఈ ఫైటింగ్ సీన్ కోసం చాలానే కష్టపడ్డానని.. ఆ సీన్ ని అంత త్వరగా మర్చిపోలేను అని.. షూటింగ్ పూర్తి అయ్యిన తరువాత నడవడానికి కూడా చాలా కష్టపడ్డానని రామ్ పోతినేని చెప్పుకొచ్చారు. “22.04.23 రోజు నాకు బాగా గుర్తు. సమ్మర్ లో ఎంత వేడిగా ఉంటుందో తెలుసు.. అలాంటి రోజుల్లో ఈరోజు కూడా ఒకటి. మొత్తం 25 రోజుల షెడ్యూల్ లో అది మూడో రోజు మాత్రమే.
Advertisement
ఆరోజు ఎపిసోడ్ షూట్ అయ్యాక నడవడం కష్టమైంది. కనీసం అడుగులు వేయడమే కష్టం ఐంది. నడుస్తుంటే పాదాల్లోంచి రక్తం వచ్చింది. ఆ సీన్ ఎలా రావాలి, ఎలా చేయాలి అనేది మా డైరెక్టర్ చేసి చూపించారు. కంటెంట్ నచ్చడం, నచ్చకపోవడం అనేది ప్రేక్షకుల ఇష్టం. కానీ నా సినిమా కోసం వచ్చే ప్రేక్షకుల కోసం నేను ఎంత కష్టపడడానికైనా వెనకాడను.” అంటూ షూటింగ్ టైం లో గాయపడిన పాదం ఫోటో ను పంచుకుంటూ పోస్ట్ చేసారు.
Read More:
క్రికెట్ ఫీల్డ్ లో ” టైమ్డ్ ఔట్” అంటే అర్ధం ఇదేనా? భారత్ లో ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా?
రామ్ గోపాల్ వర్మకు చంద్రబాబు నాయుడు నచ్చకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? అసలు విషయం ఇదే!