Advertisement
Ramabanam Movie Review in Telugu: “రామబాణం” రివ్యూ & రేటింగ్: చాలాకాలం గ్యాప్ తర్వాత మ్యాచో హీరో గోపీచంద్ నటించిన చిత్రం రామబాణం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ చిత్రంలో గోపీచంద్ కి జోడిగా డింపుల్ హయాతి నటించింది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు.
Advertisement
గతంలో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో రామబాణం అనే మూవీ తో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. మరి వేసవి కానుకగా మే 5వ తేదీన విడుదలైన రామబాణం మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Read also: UGRAM MOVIE REVIEW IN TELUGU అల్లరి నరేష్ “ఉగ్రం” ఫస్ట్ రివ్యూ
Ramabanam Movie Story in Telugu కధ మరియు వివరణ:
యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అన్నదమ్ముల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో మరోసారి జగపతిబాబు, గోపీచంద్ అన్నదమ్ములుగా నటించారు. కార్పొరేట్ మాఫియా నేపథ్యంలో సాగే కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కార్పొరేట్ మాఫియా రూపంలో ఓ కుటుంబానికి ఎదురైన కష్టాలని హీరో ఎలా ఎదుర్కొన్నాడు..? తన కుటుంబాన్ని రక్షించే క్రమంలో హీరోకి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి..? హీరోకి జగపతిబాబు ఎలాంటి సపోర్ట్ అందించాడు..? చిన్నప్పుడే ఇంట్లో గొడవపడి వెళ్లిపోయి డాన్ గా ఎదిగిన హీరో ఆ మాఫియా అని ఎలా ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
నిజానికి ఇది పాత చింతకాయ పచ్చడి కధే. గత కొన్నేళ్లుగా చాలామంది దర్శకులు వాడిన మాస్ కమర్షియల్ సబ్జెక్టుని ఇప్పుడు శ్రీవాస్ కూడా ఇదే కథతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. స్టోరీ విషయానికి వస్తే.. చిన్నప్పుడే తన అన్న జగపతిబాబుతో గొడవ వల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాడు హీరో. ఆ తరువాత ఓ మాఫియా విలన్ వద్ద చేరతాడు. ఇక కొన్ని ఏళ్ల తర్వాత తన ఫ్యామిలీతో తిరిగి కలవడానికి వెళ్లిన హీరోకి తన అన్న ఓ సమస్యలో ఉన్నాడని తెలుసుకొని.. అన్న కోసం ఏం చేశాడు అన్నది అసలు కథ.
గోపీచంద్ ని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా చూపించారు శ్రీవాస్. కేవలం క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే కాకుండా మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా డైలాగ్స్ ఉన్నాయి. కుష్బూ, వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తమ పాత్రలకి తగ్గ నటనతో మెప్పించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా సినిమాని తెరకెక్కించారు. ఇక మిక్కీ జే మేయర్ బిజియం యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. జగపతిబాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెప్పే పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక డింపుల్ హయాతి యూట్యూబర్ గా, తన అందం, నటనతో అలరించింది. సినిమా మొత్తం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. మొత్తానికి రామబాణం బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్:
యాక్షన్, కామెడీ
నటీ నటుడు
బీజీఎం
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
కథ
“రామబాణం” రివ్యూ రేటింగ్: 2.75/5
Read also: The Kerala story movie review in Telugu “ది కేరళ స్టోరీ” సినిమా రివ్యూ & రేటింగ్