Advertisement
Ramesh Babu Wife Mrudula Ghattamaneni: టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ వయసు రిత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు సహా సిని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ ఫ్యామిలీకి 2022 అస్సలు మర్చిపోలేని సంవత్సరం. ఒకే కుటుంబంలో ముగ్గురు ఈ సంవత్సరమే మరణించారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే జనవరి 8వ తేదీన వారి ఇంట్లో మొదటి విషాదం చోటుచేసుకుంది.
Advertisement
mrudula ghattamaneni
కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబుకు అన్నయ్య అయినా రమేష్ బాబు లివర్ సంబంధిత సమస్యలతో మరణించారు. వయో సంబంధిత వ్యాధితో కృష్ణ భార్య ఇందిరా దేవి సెప్టెంబర్ 28వ తేదీన మరణించారు. అయితే మహేష్ బాబుకి తల్లి ఇందిరా దేవి చనిపోయిన నెలకి తండ్రి చనిపోవడం నిజంగా బాధాకరం. కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటే ఒంటరి అయ్యింది మహేష్ బాబు కాదు. ఘట్టమనేని మృదుల. ఎవరు ఈ మృదుల అనుకుంటున్నారా? ఆమె కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు భార్య మృదుల. రమేష్ భార్య అయినప్పటికీ మృదుల ఏనాడు మీడియా ముందు కనిపించలేదు.
Advertisement
గొప్పింటి కోడలి ధర్పం చూపించలేదు. ఆమె భర్త ఆరోగ్యపరమైన ఇబ్బందులతో 8 నెలల క్రితం కన్నుమూస్తే ఆమె తన ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ఉంటది గానే జీవిస్తుంది. భర్త పోయినా అటు అత్త, ఇటు మామ ఉన్నారన్న భరోసా ఉండేది. ఇక మహేష్ బాబు ఎలాగూ మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ పోయిన నెలలో ఇందిరా దేవి కన్ను మూసింది. ఇక ఇప్పుడు కృష్ణ వంతు వచ్చింది. ఇద్దరూ కన్నుమూయడంతో ఇప్పుడు భర్త, అత్త, మామ అందరూ కోల్పోయి ఒంటరిగా మారింది. ఇంకా ఆమెకు ఒక కుమారుడు జయకృష్ణ మరియు కూతురు కూడా ఉన్నారు. వారు ఇంకా సెటిల్ అయినట్టుగా కనిపించడం లేదు. ఇలా ప్రస్తుతం మృదులా ప్రపంచం మూగబోయింది. ఒక్క మహేష్ బాబు మాత్రమే ఇప్పుడు ఆమెకు అండగా నిలవాలి.
READ ALSO : అసెంబ్లీ టికెట్ కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకున్నాడుగా !