Advertisement
రామోజీరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రామోజీరావు ఎంతోమంది హృదయాల్లో నిలిచిపోయారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామాజీరావు చనిపోవడంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ షాక్ అయింది. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ని హాస్పిటల్లో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు తర్వాత పరిస్థితి కాస్త క్రిటికల్ అయ్యింది. రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతో వెంటిలీటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు.
Advertisement
ఆయన మృతదేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని నివాసానికి తరలించారు 1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో పుట్టారు. 2016లో రామోజీరావుకు భారత రెండవ అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీరావు గురించి ఎన్నో చెప్పొచ్చు. ఉదయ్ కిరణ్ నుండి ఎన్టీఆర్ వరకు చాలామంది హీరోలను కూడా ఈయన పరిచయం చేశారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా 30 దాకా సినిమాలను నిర్మించారు. ఆయన నిర్మించిన సినిమాల్లో శ్రీవారి ప్రేమలేఖ మొదటిది. 1984లో ఈ సినిమా వచ్చింది.
Advertisement
Also read:
Also read:
రామోజీరావు చాలామంది హీరోలను పరిచయం చేయడం జరిగింది. ఉదయ్ కిరణ్ ను పరిచయం చేస్తూ చిత్రం సినిమాను నిర్మించారు. అది హిట్ అయింది అలాగే తరుణ్ణి పరిచయం చేస్తూ నువ్వే కావాలి సినిమా తీశారు. అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. దర్శకుడు శ్రీను వైట్ల ఆనందం సినిమా ని కూడా తీసుకు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నిన్ను చూడాలని మూవీ ని కూడా ఈయనే నిర్మించారు తనీష్ ని పరిచయం చేస్తు సినిమాని నిర్మించారు రామోజీరావు. ఆఖరిగా ఈయన సినిమా దాగుడుమూత దండాకోర్.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి