Advertisement
సీనియర్ హీరో నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్.. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ సినిమాల కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలు, వివాదాలతోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సీనియర్ నటుడు నరేష్ తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే వీరు అధికారికంగా కూడా ప్రకటించేశారు. డిసెంబర్ 31వ తేదీన వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 2023 కి కొత్తగా స్వాగతం పలుకుతున్నామంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని కూడా తెలిపారు. అయితే ఈ విషయంపై రమ్య రఘుపతి స్పందించారు.
Advertisement
Also Read: “జబర్దస్త్” లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఈ కమెడియన్స్ ఎక్కడ ఉండేవారు ?
Advertisement
మా ఇద్దరికీ విడాకులు అయిపోయాయని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం లేదని చెప్పింది. తమ విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతుందని తెలిపింది. కృష్ణగారి అంత్యక్రియల సమయంలో జరిగిన సంఘటనలు చెబుతూ వీడియో ప్రూఫ్ లను చూపిస్తూ నరేష్ చేసిన పనులు తన అత్త విజయనిర్మల క్షమించిందంటూ ఫైర్ అయ్యారు. కృష్ణ గారు మరణించిన రోజు రాత్రి ఇంటి వద్ద ఆయన మృతదేహం ఉంచి, మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పద్మాలయ స్టూడియోకి తీసుకువెళ్లారని రమ్య తెలిపారు. ఆ రాత్రంతా మృతదేహం వద్ద కృష్ణ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని వెల్లడించారు.
Also Read: పవన్ – బాలయ్యల మధ్య ఉన్న ఈమె ఎవరో చెప్పగలరా ?? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !
వాళ్లందరూ పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్లడమా, ఇక్కడ ఉంచడమా, అనే కన్ఫ్యూజన్ లో ఉండగా, నరేష్ అసలు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదని కృష్ణ గారి మృతదేహాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు అంటూ తెలిపారు రమ్య. రాత్రి 9 గంటల ప్రాంతం నుండి దాదాపు ఉదయం 9 గంటల వరకు మృతదేహం వద్ద కేవలం రమ్య రఘుపతి, ఆమె కొడుకు రన్వీర్ మాత్రమే మృతదేహం వద్ద జాగారం చేశారట. ఇక కొంతమంది డ్రైవర్లు తప్ప ఎవరూ లేరు. ఈ విషయాలను రమ్య రఘుపతి తాజాగా తెలిపారు.
Also Read: వారసుడులో శ్రీకాంత్ రోల్ ఏమిటో తెలుసా?