Advertisement
ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం విడాకులు.. అయితే చాలా మంది భార్యాభర్తలు తెలిసి చేస్తున్నారో లేక తెలియక చేస్తున్నారో పెద్ద పెద్ద స్టార్లు కూడా దాంపత్య జీవితానికి డైవర్స్ తో పుల్ స్టాప్ పెడుతున్నారు. సమంత, నాగ చైతన్య, ధనుష్, శ్రీజ, అమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు ఇప్పటికి విడాకులు తీసుకోవడానికి సిద్ధ పడిపోయారు.. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో కూడా వీరి బాటలోనే వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
Advertisement
వారు ఎవరయ్యా అంటే దగ్గుబాటి హీరో రానా. ఈయన కూడా వారి బాటలోనే తన భార్యకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాడని సోషల్ మీడియా వేదికగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వారి మధ్య గొడవలు వచ్చాయని దీనివల్ల వారు డైవర్స్ వరకు వెళ్లారని తెలుస్తోంది.. దీనికి సంబంధించిన వార్త ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.. ఈ క్రమంలోనే రానా కూడా సోషల్ మీడియా కి దూరం అవుతున్నానని పాత పోస్ట్ లు డిలీట్ చేయడంతో వారి విడాకుల వ్యవహారానికి సంబంధించిన వార్తలకు మరింత బలం చేకూరింది.
Advertisement
ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ చాలా మంది ఫ్యాన్స్ మాత్రం బాధపడుతున్నారు.. ఈ క్రమంలోనే రానా భార్య మీహిక స్పందించింది.. వారి సెకండ్ యానివర్సరీ కి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ సందర్భంలో తన భర్తతో ఉన్న క్లోజ్ మూమెంట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ఈ విధంగా మిహిక మా మధ్య ఎలాంటి గొడవలు రాలేదని, విడాకుల వ్యవహారం అంతా పుకారే అనే ఈ విధంగా అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే సమాధానాన్ని చెప్పకనే చెప్పింది.
ALSO READ: