Advertisement
హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ ను సాధించిన రానా దగ్గుబాటి 2020 లో కరోనా సమయంలో తను ప్రేమించిన అమ్మాయి మిహితా బజాజ్ ని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమె నార్త్ ఇండియాకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు సాంప్రదాయాలు కూడా ఎంతో బాగా పాటిస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో కర్వా చౌత్ సందర్భంగా ఈమె ఒక పోస్ట్ చేశారు.
Advertisement
ఈమె ప్రతి సందర్భాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఎంతో యాక్టివ్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మిహితా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదు అయినా సరే అందం విషయంలో ఏ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అనే చెప్పాలి. బిజినెస్ ఉమెన్ గా ఈమె చాలా బిజీగా ఉంటారు. అయితే రానా పై తనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈ పోస్టును చేయడం జరిగింది.
Advertisement
Also read:
కర్వా చౌత్ ను ఎంతో ఘనంగా జరుపుకొని దీనికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. పెళ్లయిన మహిళలు తమ భర్త క్షేమంగా ఉండాలని ఈ పండుగను జరుపుకుంటారు. ఎంతో సాంప్రదాయంగా గోరింటాకు పెట్టుకుని, ఉపవాసం చేసి సాయంత్రం చంద్రుడిని చూసి తర్వాత జల్లెడలో తన భర్త మొహాన్ని చూసి ఉపవాసాన్ని విరమించడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తే భర్త క్షేమంగా ఉంటారని నమ్ముతారు.ఈ విధంగా మిహికా కూడా కర్వా చౌత్ ను జరుపుకొని దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి!తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!