Advertisement
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘రంగస్థలం’. ఈ సినిమా 1980ల నేపథ్యంలో వచ్చింది. ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. 2018 లో విడుదల అయ్యిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. పల్లె టూర్లలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటాయా అనిపించేలా ఉంటాయి.
Advertisement
అన్నిటికంటే ముఖ్యంగా రామ్ చరణ్ అన్నగా నటించిన ఆది పినిశెట్టి చనిపోయిన సన్నివేశం అయితే ప్రేక్షకులందరిని కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు శబ్దాలు వినిపించవు. అందుకే మిషన్ పెట్టుకోమని అతని అన్న కుమార్ హియరింగ్ ఎయిడ్ కొనిస్తాడు. కానీ రామ్ చరణ్ దాన్ని పెట్టుకోకుండా అలానే ఉంటాడు. ఓసారి కుమార్ ప్రమాదంలో పడితే అతనికోసం వెతుకుతూ వెళ్లి రామ్ చరణ్ రౌడీలతో ఫైట్ చేసి అన్నని తీసుకొస్తాడు.
Advertisement
ఓ డాబా దగ్గర ఆగి అన్నకి అయిన గాయాలకు పసుపు పెడదామని అనుకుంటాడు. చిట్టిబాబు వెళ్లి పసుపు తీసుకొచ్చే లోపు ఎవరో ఒక వ్యక్తి కుమార్ ని పొడిచేసి వెళ్ళిపోతాడు. కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. అయితే.. ఈ సన్నివేశం జరగడానికి ముందు మహేష్ తో మాట్లాడుతూ ఉంటాడు చిట్టిబాబు. అక్కడ రౌడీలు మాట్లాడుకునే మాటలు వినే సైకిల్ వేసుకుని వెళ్తాడు.
అసలు ఆ సమయంలో సైకిల్ వేసుకుని ఒక్కడే వెళ్లకుండా , వెంట మహేష్ ని కూడా తీసుకుని వెళ్లుంటే అసలు ఇంత అఘాయిత్యం జరిగేదే కాదు కదా. కుమార్ బాబు బతికే ఉండేవాడు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని మనం అనుకున్నట్లు తీస్తే అది సినిమా ఎందుకు అవుతుంది? అందుకే ఈ సినిమాను సినిమాలపైనే చూడడం మంచిది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చి ఇప్పటికి ఐదేళ్లవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
మరిన్ని..
గుడికి వెళ్లేముందు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎలాంటి ఆహరం తీసుకోకూడదు?
Spandana APస్పందన యాప్ అంటే ఏమిటి? దీని వలన ప్రజలకు కలిగే లాభాలు ఏమిటి?