Advertisement
Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
Advertisement
మేషం :- భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అకాల భోజనం, శ్రమాధిక్తవల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. శాంతియుతంగా మీ సమస్యలు పరిష్కరించుకోవాలి.
Today Horoscope in Telugu 2022
వృషభం :- ప్రైవేటు రంగాల్లో వారికి ఒక ప్రకటన ఎంతో ఆందోళన కలిగిస్తుంది. బకాయిలు, నెలసరి వాయిదాల వసూళ్లలో కలెక్షన్ ఏజెంట్లు లౌక్యంగా మెలగాలి. ప్రయాణాలు సజావుగా సాగినా లక్ష్యం నెరవేరదు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు.
మిథునం :- చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహరాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
కర్కాటకం :- వ్యాపారం చేయాలి అనే అలోచన ఫలిస్తుంది. ఉద్యోగస్థుల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ, ఏకాగ్రత అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.
సింహం :- మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు ఇబ్బంది కలిగిస్తాయి. సినిమా, విధ్య, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. మీ సంతానంలో వచ్చిన మార్పు మీకెంతో సంతృప్తినిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదాపడతాయి. బంధుమిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
Advertisement
కన్య :- ఆలయ సందర్శనాల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఐరన్, సిమెంటు, కలప, ఇనుము, ఇసుక, ఇటుక, వ్యాపారస్తులకు లాభదాయకం. దంపతులకు ఏ విషయంలోను పొత్తుకుదరదు. ఉమ్మడి వ్యవహారాలు, ఆస్తి పంపకాల విషయంలో ఖచ్చితంగా మెలగాలి. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురికావచ్చు.
తుల :- స్త్రీలకు ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. బంధువులతో స్పర్థలు తొలగి సంబంధాలు బలపడతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ చిరువ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంమంచిది.
వృశ్చికం :- వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ చికాకులు, ఇబ్బందులు తాత్కాలికమేనని గమనించండి. ఆర్థిక విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి అధికారులు, సహోద్యోగులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు.
ధనస్సు :- ఆదాయ వ్యయాలకు ఏ మాత్రం పొంతన ఉండదు. దూర ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం అధికమవుతుంది. మిత్రులను కలుసుకుంటారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వటం మంచిది కాదు. వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు.
మకరం :- వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మీ సోదరి మొండివైఖరి మీకు ఎంతోచికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది.
కుంభం :- మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయంచేస్తారు. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. నేడు చేద్దామన్న పనులు రేపటి వాయిదావేస్తారు.
మీనం :- బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ ప్రముఖులను కలసి బహుమతులను అందజేస్తారు. స్త్రీలు ఉదరం, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. సంగీత, నృత్య కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.
Read also: DASARA MOVIE DIALOGUES: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!