Advertisement
Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
Advertisement
మేషం : రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం వంటివి తప్పదు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
వృషభం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది.
మిథునం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. చేతి వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో రాణిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రతర్థులు సైతం వీరి ఔనత్యాన్ని గుర్తిస్తారు.
కర్కాటకం :- బంధుమిత్రులను కలుసుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. స్థిరాస్తిక్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రేమికులకు మధ్య పరస్పర అవగాహన కుదరదు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
సింహం :- స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళకలు పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది.
Advertisement
కన్య :- చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. కొన్ని విషయాల్లో కుటుంబీకుల ధోరణి చికాకు కలిగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. బంధుమిత్రుల రాకపోకలు అధికం. పీచు, ఫోం, లెదర్, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆలోచనలు అమలుచేస్తారు.
తుల :- కంది, మిర్చి, నూనె, ధాన్యం, అపరాలు వ్యాపరులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రయాణాలు, దైవ కార్యాలు ఉల్లాసం కలిగిస్తాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి.
వృశ్చికం :- భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయాల్లో వారు విరోధులువేసే పథకాలను తెలివితో ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల మాటపడతారు. స్త్రీలు ఒత్తిడికి లోనైన మంచి గుర్తింపు లభిస్తుంది.
ధనస్సు :- లీజు, ఏజెన్సీ, ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనామీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు. పారిశ్రమికులకు కార్మికులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
మకరం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభాదాయకం. పారిశ్రామిక రంగం వారికి అధికారుల వేధింపులు, కార్మిక సమస్యలు అధికమవుతాయి. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు పూర్తవుతాయి. హోటల్, తినుబండారాలు, బేకరీ, పండ్ల వ్యాపారులకు లాభదాయకం.
కుంభం :- చేపట్టిన పనులలో ఓర్పు, అధిక శ్రమ చాలా అవసరం. నిర్మాణ పనులలో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగులు పదోన్నతి, స్థానమార్పిడి యత్నాలలో సఫలీకృతులవుతారు. ముఖ్యుల రాకపోకల వల్ల అనుకోని ఖర్చులు అధికమవుతాయి. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
మీనం :- నిరుద్యోగులకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి. వ్యవసాయదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంతృప్తి పొందుతారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.