Advertisement
Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు… మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
Advertisement
మేషం :- బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరగలదు. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి.
Today Horoscope in Telugu 2022
వృషభం :- రిప్రజెంటివ్‌లకు మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.
మిథునం :- ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసివస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ప్రతిపని చేతిదాకా వచ్చి వెనక్కి పోవడం వల్ల నిరుత్సాహం, ఆవేదనకు లోనవుతారు.
కర్కాటకం :- బంధు మిత్రులకు మీపై మరింత అభిమానం కలుగుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంగారు, వాహనం ఇత్యాది విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ప్రైవేటు సంస్థలలో వారికి, పారిశ్రామిక రంగంలో వారికి పనివారితో సమస్యలు తప్పవు. ఖర్చులకు ఆదాయాన్ని సమకూర్చుకుంటారు.
సింహం :- ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందు లెదుర్కుంటారు.
కన్య :- విద్యార్ధినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. లైసెన్సుల రెన్యువల్, లీజు పొడిగింపుల్లో అశ్రద్ధ తగదు. మీ సంతానం కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు.
Advertisement
తుల :- స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపారాలలలో ఒడిదుడుకులు సమర్ధంగా ఎదుర్కొంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి ఉంటుంది.
వృశ్చికం :- బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
ధనస్సు :- రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఫ్యాన్సీ, బంగారం, వెండి, లోహ, రత్న వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి.
మకరం :- ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒప్పందాలు, హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. స్త్రీలకు బంధువులు, చుట్టుప్రక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి.
కుంభం :- నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. చేతివృత్తులవారికి సదావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. దైవ, శుభకార్యాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు.
మీనం :- వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయుకృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. చేసే పనిలో ఏకాగ్రత,పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకుబాగా ఉపకరిస్తుంది. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించటంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతాయి.
READ ALSO : డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!