Advertisement
Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
Advertisement
మేషం :- ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
Today Horoscope in Telugu 2022
వృషభం :- ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
మిథునం :- సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో మెళుకుం అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాక పోకలు అధికమవుతాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
కర్కాటకం :- విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. కోర్టు వ్యవహరాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. నూతన వ్యక్తుల విషయంలో అప్రమత్నంగా వ్యవహరించండి. వృత్తి పరంగా ఎదురైన సమస్య తొలగిపోతాయి.
సింహం :- వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళకువ అవసరం. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం క్షేమదాయకం. ఓ చిన్న విహార యాత్ర చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది.
కన్య :- బంధువర్గాలతో తెగిపోయిన రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఇంజనీరింగ్ రంగంలో వారికి మెలకువ అవసరం. ఓ చిన్న విహార యాత్ర చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు.
Advertisement
తుల :- ప్రముఖుల కలయిక అనుకూలించదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రావలసిన ధనం వసూలులో కొంత మొత్తం వసూలు కాగలదు.
వృశ్చికం :- సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి.
ధనస్సు :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. షాపుగుమాస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి, ధనలాభం, విందు భోజనం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
మకరం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. సినిమా, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతాలోపం, కలహాలు చోటుచేసుకుంటాయి.
కుంభం :- స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులు నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
మీనం :- రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఉన్నతస్థాయి అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారముంది. కొబ్బరి, పండ్ల, పూల, బేకరీ, కూరగాయల వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
Read also: ADIPURUSH MOVIE DIALOGUES TELUGU AND ENGLISH ఆదిపురుష్ డైలాగ్స్